తెలుగు రాష్ట్రాల రాజకీయాల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. పలు చిత్రాల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పాత్రలను చూశాం. ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’లో చంద్రబాబు ాపత్రలో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా కనిపించగా.. రామ్ గోపాల్ వర్మ తాను తీసే పొలిటికల్ సెటైర్ సినిమాల్లో చంద్రబాబు పాత్రలో అచ్చం అలాంటి పోలికలే ఉన్న ఒక నటుడితో ఆ పాత్ర చేయిస్తున్నారు.
‘యాత్ర’ సినిమాలో చంద్రబాబు పాత్రలో ఒక నటుడిని కనిపించీ కనిపించకుండా చూపించారు దర్శకుడు మహి.వి.రాఘవ్. ఇప్పుడు అతనే ‘యాత్ర-2’ తీస్తున్నాడు. ‘యాత్ర’ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందించిన మహి.. ‘యాత్ర-2’ను జగన్ పాదయాత్ర నేపథ్యంలో నడిపించబోతున్నాడు. ఈ చిత్రంలో జగన్ పాత్రను తమిళ నటుడు జీవా చేస్తుంటే.. ‘యాత్ర’లో లీడ్ రోల్ చేసిన మమ్ముట్టినే ఇందులోనూ వైఎస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు.
కాగా ‘యాత్ర’లో మాదిరి కాకుండా ఇందులో చంద్రబాబు పాత్రకు ప్రాధాన్యం ఉంటుందట. ఆ పాత్రను పలు సన్నివేశాల్లో చూపించాల్సిన అవసరం ఉందట. అందుకే ఆ పాత్ర కోసం ఒక ప్రముఖ వ్యక్తినే తీసుకున్నాడట మహి. నటుడిగా మారి బోలెడన్ని పాత్రలు చేసిన బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్.. ‘యాత్ర-2’లో చంద్రబాబు పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
తెలుగులో ‘అదుర్స్’ సహా ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు చేసిన మహేష్‌ను దాదాపుగా ఇందులోనూ విలన్ తరహా పాత్రే చేస్తున్నట్లు భావించాలి. మామూలుగా చూస్తే మహేష్‌లో చంద్రబాబు పోలికలేమీ కనిపించవు. మరి మేకప్‌తో ఎలా మేనేజ్ చేశారో చూడాలి. దివంగత వైఎస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ను జనాలకు ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు మహి. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మీద సినిమా తీసి మెప్పించడం అంటే అంత తేలిక కాదు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on October 28, 2023 3:14 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…