బాలీవుడ్డే కాదు అన్ని బాషల మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న సినిమాగా అనిమల్ మీదున్న అంచనాలు ఏ స్థాయివో చెప్పాలంటే ఓపెనింగ్ రోజు వచ్చే కలెక్షన్లు చూశాకే క్లారిటీ వస్తుంది. చాప కింద నీరులా కేవలం లిరికల్ వీడియోస్ తోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హైప్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. హీరో రన్బీర్ కపూర్ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఇంత డార్క్ అండ్ డీప్ డ్రామాలో తానెప్పుడూ నటించలేదని, ఇలాంటి ఛాలెంజ్ ఉన్న పాత్ర దగ్గరి భవిష్యత్తులో దొరుకుంటుందన్న నమ్మకమూ లేదని అన్నాడు. దీన్ని బట్టే క్యారెక్టరైజేషన్ స్థాయిని ఊహించుకోవచ్చు.
ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని అనిమల్ కి పని చేసిన యూనిట్ టాక్. ఒళ్ళు గగుర్పొడిచే వయొలెన్స్ ఇందులో చాలా ఉంటుందని, విలన్ల బ్యాచ్ ని నరమాంసం తినే భక్షకులుగా చూపించడం స్టార్ హీరోల ఫిల్మోగ్రఫీలో ఇదే మొదటిసారి అవుతుందని ఊరిస్తున్నారు. హాలీవుడ్ లో క్యానిబాల్స్ సంస్కృతి మీద చాలా సినిమాలొచ్చాయి. కానీ మనవాళ్ళు ఎవరూ ఆ కాన్సెప్ట్ ని అంతగా వాడుకోలేకపోయారు. ఇక్కడి ఆడియన్స్ రిసీవ్ చేసుకోరనే భయమే దానికి కారణం. అయితే సందీప్ వంగా చాలా తెలివిగా వాటిని కథలో పొందుపరిచి చూపించిన తీరు సరికొత్తగా ఉంటుందట.
ఇంతే కాదు రన్బీర్ కపూర్ కుటుంబం చేసే హత్యలు, దారుణాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. తనను ప్రేమించిన కారణంగా రష్మిక మందన్న వీళ్ళలో మార్పు తెచ్చేందుకు హోమాలు యాగాలు చేయిస్తుందట. దీనికి సంబంధించిన ఒక షాట్ ని నిన్న రిలీజ్ చేసిన పాటలో చూడొచ్చు. ఇంటర్వెల్ కు ముందు రన్బీర్ మీద శత్రువులు దాడి చేసి అతన్ని రక్తపు మడుగులో పడేసి ఎపిసోడ్ గురించి ఎంతైనా ఊహించుకోమని ఊరిస్తున్నారు. చూస్తుంటే పెద్దలకు మాత్రమే అని నిర్దేశించే ఏ సర్టిఫికెట్ తోనే అనిమల్ థియేటర్లలో అడుగుపెట్టేలా ఉంది. డిసెంబర్ 1 వీలైనంత త్వరగా రావడమే ఆలస్యం.
This post was last modified on October 28, 2023 12:09 pm
దర్శకుడు ప్రశాంత్ వర్మకి హనుమాన్ కన్నా ముందు కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చిన సినిమా జాంబీ రెడ్డి. అప్పటిదాకా టాలీవుడ్…
ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రూపంలో ఒక్కసారి బ్రేక్ దక్కిందంటే ఆ దర్శకుడి సుడి మాములుగా తిరిగదు. వెంకీ అట్లూరి పరిస్థితి…
"విచారణకు రండి. ఈ నెల 18న హాజరై మాకు సహకరించండి. వచ్చేప్పుడు మీ వద్ద ఉన్న ఆధారాలు వివరాలు కూడా…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన…
వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్ ఉన్నవి కాకుండా కొత్త సినిమాలు ఏవీ చేస్తారనే దాని గురించి రకరకాల…