ఈ మధ్య డైరెక్ట్ ఓటిటి రిలీజవుతున్న సినిమాలకు మరీ గొప్పగా ఉందనే టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు అటుకేసి చూడటం లేదు. పైగా ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ ఎక్కువైపోయి అన్నింటికీ చందాలు కట్టలేక రెండు మూడింటితో సర్దుకుంటున్న జనాలకు విపరీతమైన ఆప్షన్లు వచ్చి పడుతున్నాయి. ఆ కోవలో వచ్చిందే #కృష్ణారామా. ఆకాష్ పూరిని ఆంధ్రాపోరితో లాంచ్ చేసిన దర్శకుడు రాజ్ మాదిరాజు దీన్ని తెరకెక్కించారు. ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడో 1988లో అంటే ముప్పై అయిదు సంవత్సరాల క్రితం బామ్మమాట బంగారుబాటలో జంటగా కనిపించిన రాజేంద్రప్రసాద్, గౌతమి మళ్ళీ ఇప్పుడు భార్యా భర్తలుగా నటించడం.
ఇంతకీ కథేంటో చూద్దాం. పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో రిటైర్డ్ జీవితాన్ని ఒంటరిగా గడుపుతూ ఉంటారు రామతీర్థ(రాజేంద్ర ప్రసాద్), కృష్ణవేణి(గౌతమి). ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రీతీ(అనన్య శర్మ) ఉంటుంది. నెలకోసారి వీడియో కాల్స్ తో మాత్రమే సంతానంతో టచ్ లో ఉండటం భరించలేక ప్రీతీ సలహాతో జాయింట్ గా ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కృష్ణరామలు. ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టాక తక్కువ టైంలో సెలబ్రిటీలుగా మారిపోతారు. ఒక సోషల్ ఇష్యూకి సంబంధించి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకుల దాకా వెళ్దామనుకుంటారు. ఆ తర్వాత జరిగేది స్మార్ట్ స్క్రీన్ మీద చూడాలి.
వృధాప్యంలో తల్లితండ్రులకు అండగా ఉండాల్సిన అవసరాన్ని, సోషల్ మీడియా తాలూకు విపరీత పరిణామాలను ఒకే కథతో చెప్పాలనుకున్న రాజ్ మాదిరాజు దాన్ని వినోదాత్మక ధోరణికి బదులు సందేశాత్మక టైపులో చెప్పాలని ప్రయత్నించారు. దీంతో మెసేజ్ కోటింగ్ ఎక్కువైపోయి సగటు ఆడియన్స్ కి కృష్ణరామ అధిక శాతం బోర్ కొట్టేలా సాగుతుంది. కాసింత కామెడీ, వృద్ధ జంట నటనని ఎంజాయ్ చేయగలిగితే ఓకే కానీ సహజత్వానికి దూరంగా నాటకీయత ఎక్కువైపోయిన ఇలాంటి కంటెంట్ డిజిటల్ ఫార్మట్ కే కరెక్ట్. ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అలా ఓ లుక్ వేయడం తప్పించి మరీ ప్రత్యేకంగా అయితే లేదు.
This post was last modified on October 28, 2023 2:47 am
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…