అఖండ నుంచి దర్శకుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్న బాలకృష్ణ దానికి తగ్గట్టే వరస బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా భగవంత్ కేసరి కూడా అంచనాలకు మించి ఆడటంతో నెక్స్ట్ బాబీతో చేయబోయే సినిమా అంచనాలు షూటింగ్ మొదలు కాకుండానే పెరిగిపోయాయి. వచ్చే నెల రెండో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఇది ఎన్బికె 109. ఆ తర్వాత ఎవరితో చేస్తారనే క్లారిటీ ఇంకా రాకపోయినా కీలకమైన కొన్ని ప్రోజెక్టులకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకో మూడేళ్ళ దాకా డైరీ బిజీగా ఉండేలా బాలయ్య ప్లాన్ చేసుకున్నట్టు వినికిడి.
వాటిలో 110వ సినిమాకు బోయపాటి శీను ఆల్మోస్ట్ లాక్ అయినట్టు తెలిసింది. అది అఖండ 2 అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అఘోర పాత్రను కొనసాగించడంతో పాటు పొలిటికల్ టచ్ వచ్చేలా ఒక కథను గతంలోనే అనుకున్నారట. ఇప్పుడేమైనా కీలక మార్పులు ఉంటాయేమో చూడాలి. 111 మూవీకి మళ్ళీ వీరసింహారెడ్డి కాంబినేషన్ ని రిపీట్ చేయబోతున్నారట. గోపిచంద్ మలినేని ప్రస్తుతం రవితేజతో చేస్తున్న చిత్రం పూర్తి కాగానే ఒక స్టోరీ వినిపించబోతున్నట్టు సెపరేట్ లీక్. వీళ్ళు కాకుండా కుదిరితే సుకుమార్ తోనూ చేయాలని బాలయ్య చూస్తున్నారట కానీ బాగా టైం పట్టొచ్చు.
మరి ఆదిత్య 999 సంగతేంటని డౌట్ రావొచ్చుగా. కేవలం ఐడియా వరకు మాత్రమే బాలయ్య దగ్గర ఉంది కానీ దానికి సరైన దర్శకుడు, టీమ్ దొరికాక మాత్రమే స్క్రిప్ట్ పనులు మొదలవుతాయి. స్వంత డైరెక్షన్ లో చేయాలని బాలయ్య అనుకున్నా ఇంకా నిర్ధారణగా నిశ్చయించుకోలేదు. సాయిమాధవ్ బుర్రాతో మంతనాలు జరుగుతున్నాయట. మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన సినిమాని సైతం ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. కేసరి ప్రమోషన్ ఇంటర్వ్యూలలో వచ్చే ఏడాదే మొదలవుతుందని అన్నారు కానీ క్లాప్ కొట్టే దాకా చెప్పలేం. మొత్తానికి పవర్ ఫుల్ లైనప్ తో బాలకృష్ణ జోరు మాములుగా లేదు.
This post was last modified on October 29, 2023 9:07 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…