పెద్ద సినిమాలకు ఒక కాంబినేషన్ అనుకున్నాక షూటింగ్ ఏ మాత్రం ఆలస్యమైనా క్యాస్టింగ్ లో చాలా మార్పులు జరిగిపోతాయి. గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ నుంచి మొదలుపెడితే ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. ఇప్పుడీ లిస్టులో మరో మూవీ చేరింది. విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీని సితార సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత నాగవంశీ దీనికి వంద కోట్లయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇటీవలే ఒక హింట్ ఇచ్చాడు. ఇంత పెద్ద స్కేల్ అంటే రౌడీ హీరో కెరీర్ లోనే అత్యంత ఖరీదైన చిత్రం.
విడి 12గా వ్యవహరించబడుతున్న ఈ సినిమాకు ముందు ఫిక్స్ చేసుకున్న హీరోయిన్ శ్రీలీల. ఇదే విషయాన్నీ నాగవంశీ మ్యాడ్ ప్రమోషన్లలో నొక్కి చెప్పారు. కానీ ఇప్పుడు తన స్థానంలో ఏజెంట్ భామ సాక్షి వైద్యని దాదాపు ఖరారు చేసినట్టు తెలిసింది. ఫ్యామిలీ స్టార్ కోసం తిన్ననూరి ప్రాజెక్టుని కాస్త లేట్ చేయడంతో శ్రీలీల జనవరి తర్వాత కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. పైగా త్వరలో ఎంబిబిఎస్ పరీక్షల కోసం బ్రేక్ తీసుకోనుంది. తన కోసం వెయిట్ చేసే సిచువేషన్ లేకపోవడంతో సాక్షితో మాట్లాడి ప్రాథమికంగా ఓకే చేసినట్టు అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
ఇది నిజమైతే సాక్షి వైద్య సుడి తిరిగినట్టే. ఎందుకంటే మొదటి రెండు సినిమాలు ఏజెంట్, గాండీవధారి అర్జున దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఛాన్స్ కొట్టేసి మిగిలిన హీరోయిన్లు ఈర్ష్య పడేలా చేసుకుంది. అది గ్యారెంటీ హిట్ అనే పాజిటివ్ వైబ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ జోడిగా సెట్ అయిపోతే ఇంకో మైలురాయి తోడవుతుంది. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కాబట్టి వేచి చూడాలి. ఇవి కాకుండా మరో రెండు ప్రతిపాదన స్టేజిలో ఉన్నాయి. ఒకటో రెండు హిట్ అయినా చాలు సాక్షి వైద్య టాలీవుడ్లో సెటిలయినట్టే.
This post was last modified on October 28, 2023 12:07 am
మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…
పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన…
నవీన్ పొలిశెట్టిని స్క్రీన్ మీద చూసి ఏడాది దాటిపోయింది. తన చివరి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ గత…
అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుని కోట్లాది మంది కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన శ్రీదేవి.. అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్‌ను…
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మంచు ఫ్యామిలీ గొడవ.. మరోవైపు సంధ్య…