దసరా సినిమాల హడావిడి తర్వాత ఈ శుక్రవారం ఎలాంటి సందడి లేకుండా గడిచిపోయింది. సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ ఒకటే చెప్పుకోదగ్గ మూవీ అయినప్పటికీ ఓపెనింగ్స్ తక్కువగా ఉండటంతో పాటు టాక్ అంత సానుకూలంగా లేకపోవడంతో దాని రెవిన్యూ మీద పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు అందరి చూపు నవంబర్ 3న రాబోయే కీడా కోలా మీద ఉంది. ఫుల్ యూత్ కంటెంట్ తో దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది తర్వాత చేసిన చిత్రం కావడంతో అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్ వచ్చాక దీని మీదకు జనాల దృష్టి మళ్లింది.
అదే రోజు పెద్దగా పోటీ లేకపోవడం కీడా కోలాకు ప్రధానంగా కలిసి వచ్చే అంశం. మా ఊరి పొలిమేర 2 పబ్లిసిటీ వేగం పెంచారు కానీ అది హారర్ జానర్ కావడంతో దానికొచ్చే ఆడియన్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే లిరికల్ సాంగ్స్ తో తన టేస్ట్ ఏంటో మరోసారి తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చాడు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వల్ల కేవలం తన బ్రాండ్ మీదే మార్కెటింగ్ జరుగుతోంది. క్రేజీ స్టఫ్ తో రూపొందిన కీడా కోలాలో బ్రహ్మానందం చాలా కాలం తర్వాత లెన్త్ ఉన్న రోల్ చేశారు. నిడివి మరీ ఎక్కువ లేకపోయినా టైటిల్ నుంచి ఎండ్ కార్డు దాకా సందర్భానికి తగ్గట్టు ఆయన ఎంట్రీ ఉంటుందట.
ఒకవేళ కంటెంట్ కనక కరెక్ట్ గా కనెక్ట్ అయితే కీడా కోలాకు మంచి వసూళ్లు దక్కుతాయి. అప్పటికంతా భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావులు నెమ్మదించి ఉంటాయి. ఆపై వారం నవంబర్ 12న టైగర్ 3 వస్తుంది కాబట్టి కీడా కోలా థియేటర్లు ఎక్కువ రోజులు కొనసాగాలంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే. క్యాస్టింగ్ చిన్నదే అయినా ప్రొడక్షన్ పరంగా సురేష్ సంస్థ వనరులను బలంగా సమకూర్చింది. నగరాలూ పట్టణాలు ఓకే కానీ బిసి సెంటర్స్ లో కీడా కోలా నిలవడం చాలా ముఖ్యం. టీమ్ మాత్రం గట్టి నమ్మకంతో ఉంది. వివేక్ సాగర్ సంగీతం సంగీతం ఆకర్షణగా నిలవనుంది.
This post was last modified on October 27, 2023 6:05 pm
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…