ఇంకా సరైన టీజరే రాలేదు. ట్రైలర్ సంగతి దేవుడెరుగు. మొన్న ప్రభాస్ పుట్టినరోజుకి కనీసం కొత్త పోస్టర్ వదల్లేదు. అయినా సరే సలార్ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతూనే వస్తోంది. ఏపీ తెలంగాణ కలిపి సుమారు 175 కోట్లకు బిజినెస్ జరిగిందనే వార్త అభిమానుల్లో పెద్ద చర్చకే దారి తీస్తోంది. ఇంత మొత్తం షేర్ రావాలంటే గ్రాస్ ఖచ్చితంగా 300 కోట్లు దాటేయాలి. ఆర్ఆర్ఆర్ కన్నా కొంచెం తక్కువే అయినా ఆ స్థాయి టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చు. అయితే సలార్ కున్న బజ్ దృష్ట్యా ఇది సాధ్యమేనని, టికెట్ రేట్ల పెంపుకి రెండు ప్రభుత్వాలు సహకరిస్తే చేరుకోవచ్చని అంటున్నారు.
ఇది అఫీషియల్ గా నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన వార్త కాకపోయినా బయ్యర్ల వర్గాల్లో ఎడతెగని మంతనాలకు దారి తీస్తోంది. ఎందుకంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు హక్కులు కొనుగోలు చేయాలంటే ముందుగా డబ్బు సిద్ధం చేసుకోవాలి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారం వరకు కరెన్సీ లావాదేవీలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎంతో కొంత అడ్వాన్స్ ముట్టజెప్పేసి రిలీజ్ టైంకి మిగిలిన సొమ్ములు ముట్టజెప్పాలి. దీని కోసం అదనంగా వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సలార్ మీద పోసేందుకు ఎందరో ఎగబడుతున్న మాట వాస్తవం.
ఒక రోజు ముందు షారుఖ్ ఖాన్ డుంకీ పోటీ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో దాని ప్రభావం మరీ తీవ్ర స్థాయిలో ఉండదనే నమ్మకమే ఇంత రిస్క్ కి సిద్ధపడేలా చేస్తోంది. డిసెంబర్ 22తో మొదలుపెట్టి జనవరి 12 మధ్యలో చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ పెద్దగా లేవు కాబట్టి సలార్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా ఇరవై రోజుల రన్ దక్కుతుంది. అంటే యావరేజ్ గా రోజుకు 15 కోట్లు గ్రాస్ వసూలు కావాలి. ప్రభాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ బ్రాండ్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ సానుకూలంగానే కనిపిస్తున్నాయి. విడుదలకు ఇంకో యాభై అయిదు రోజులు మాత్రం టైం ఉండటంతో ఫ్యాన్స్ ఉద్వేగం క్రమంగా పెరుగుతోంది.
This post was last modified on October 27, 2023 2:33 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…