Movie News

డిప్రెషన్ బారిన కరణ్ జోహార్

డబ్బు, పేరు అన్నీ ఉన్న సెలబ్రెటీలకు ఏం తక్కువ అనుకుంటాం కానీ.. వాళ్ల సమస్యలు వాళ్లకుంటాయి. సరైన కారణం లేకుండా మనో వేదనకు గురయ్యే సెలబ్రెటీలు చాలామందే ఉంటారు. దీపికా పదుకొనే, ఐరా ఖాన్ (ఆమిర్ ఖాన్ తనయురాలు) సహా చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీలు డిప్రెషన్ సమస్యతో ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. దీపికా అయితే తనకు చాలాసార్లు ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో ఆమె మరోసారి డిప్రెషన్ గురించి మాట్లాడింది. ఆమె కొత్త విషయాలేమీ చెప్పలేదు కానీ.. తనను ఇంటర్వ్యూ చేస్తూ కరణే డిప్రెషన్ గురించి ఓపెనయ్యాడు. కొన్ని నెలల కిందట మానసిక అనారోగ్యం తనను కుంగదీసినట్లు అతను వెల్లడించాడు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక ఏడ్చిన విషయాన్ని అతను బయటపెట్టాడు.

‘‘కొన్ని నెలల కిందట ఒక ఈవెంట్లో నేను ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యాను. ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. నటుడు వరుణ్ ధావన్ నన్ను గమనించి దగ్గరికి వచ్చాడు. అంతా ఓకేనా అని అడిగాడు. తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి నన్ను మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించాడు.

అరగంట తర్వాత కాస్త మామూలైంది. ఫంక్షన్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయా. ఆ రోజు బాగా ఏడ్చేశా. తెలిసిన సైకాలజిస్టుకి ఫోన్ చేసి మాట్లాడా. నాకు ఏమవుతుందో అని భయంగా ఉందని.. త్వరలో తన కొత్త సినిమా రిలీజ్ కాబోతోందని.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పా. ఆమె నా పరిస్థితి అర్థం చేసుకుని కొన్ని మందులు ఇచ్చింది. అవి ఇప్పటికీ వాడుతున్నా. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది’’ అని కరణ్ జోహార్ వెల్లడించాడు. 

This post was last modified on October 27, 2023 12:44 pm

Share

Recent Posts

మెగా కన్ఫ్యూజన్ మళ్ళీ మొదలయ్యింది

2027 సంక్రాంతికి ఏ చిరంజీవి సినిమా విడుదలవుతుందనే దాని మీద మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలయ్యిందని మెగా కాంపౌండ్ టాక్. జనవరి…

1 hour ago

డీసీఎం పవన్ రాజీనామా ఎందుకు చేస్తారు?

రాష్ట్రంలో ఫేక్ రాయుళ్ళు బరితెగిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్రలకు పాల్పడుతున్నారు. కూటమి…

1 hour ago

టీమ్ఇండియా సిరీస్‌లో కొత్త టెక్నాలజీ

క్రికెట్‌లో బ్యాటుకు బంతి తగిలిందో లేదో తెలుసుకోవడానికి థర్డ్ అంపైర్లు టెక్నాలజీ సాయం తీసుకుంటారు. ముఖ్యంగా వికెట్ కీపర్ క్యాచ్…

2 hours ago

జనసైనికులను రెచ్చగొడుతున్నారా అంబటి?

కూటమిలో కుంపటి పెట్టేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. టీడీపీ, జనసేనల మధ్య చిన్న నిప్పు రవ్వ…

2 hours ago

రజిత ఆవేదన కరెక్టేగా

టాలీవుడ్ దర్శకులు ఈ మధ్య ఎదురుకుంటున్న సమస్య లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులను వెతికి పట్టుకోవడం. నిన్న జరిగిన దొంగ నా…

2 hours ago

డ్యామేజ్ తగ్గించే ప్రయత్నాలు ఎన్ని చేసినా

సరిగ్గా నాలుగు వారాలకు ప్యారడైజ్ మూవీ ఓటిటిలో వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్…

3 hours ago