స్టార్ హీరోలు లేని తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో ఆడటం అరుదు. అయితే కంటెంట్ ఉన్నవి హిట్టు కొట్టిన దాఖలాలు లేకపోలేదు. ప్రేమిస్తే లాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కానీ అవి యూత్ ని టార్గెట్ చేసుకున్నవి కాబట్టి రీచ్ ఎక్కువ. క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించిన ఒక విలేజ్ డ్రామాని తీసుకురావడం మాత్రం సాహసమే. స్రవంతి రవి కిషోర్ ఆ రిస్క్ తీసుకున్నారు. నవంబర్ 11న రాబోతున్న దీపావళి సరిగ్గా టైటిల్ కు తగ్గట్టు పండగను టార్గెట్ చేసుకుంది. ఇందాక ట్రైలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల వీడియోలో కథ మొత్తం అరటిపండు ఒలిచినట్టు చెప్పేశారు.
అనగనగా ఒక పల్లెటూరు. ప్రాణంగా చూసుకునే మనవడు అడిగిన కోరిక తీర్చడానికి తాతయ్య(పూరాము)దగ్గర డబ్బులు ఉండవు. దీపావళి పండక్కు ఖరీదైన దుస్తులు కోరతాడు. ఎంత చూసినా అప్పు పుట్టదు. దీంతో బలి కోసం పెంచుకున్న మేకను అమ్మడానికి సిద్ధ పడతాడు. అయితే ఇది దేవుడి వ్యవహారం కాబట్టి ఎవరూ కొనరు. మటన్ కొట్టులో పని చేసే వీరయ్య(కాళీ వెంకట్) స్వంత దుకాణం పెట్టుకోవడం కోసం మేకను కొనేందుకు తాత దగ్గరకు వస్తాడు. ఈలోగా మేకను ఒక దొంగల ముఠా ఎత్తుకుపోతుంది. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాల మధ్య వీళ్ళ ప్రయాణం ఏ గమ్యం చేరుకుందో చూడాలి.
మేకకు కమెడియన్ సప్తగిరి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆద్యంతం అచ్చమైన పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నడిపించాడు దర్శకుడు రా వెంకట్. విజువల్స్ కూల్ గా ఉన్నాయి. తీసన్ సంగీతం సమకూర్చగా జయప్రకాశ్ ఛాయాగ్రహణం అందించారు. అసలు ట్విస్టు ఏంటంటే నవంబర్ 12 సల్మాన్ ఖాన్ టైగర్ 3 లాంటి ప్యాన్ ఇండియా మూవీని పెట్టుకుని ఒక రోజు ముందు దీపావళిని విడుదల చేసేందుకు సిద్ధపడటం. బలగం లాంటి గ్రామీణ నేపధ్య చిత్రాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఆ జానర్ లోనే వస్తోంది. మరి మేక బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందో లేదో చూడాలి
This post was last modified on October 26, 2023 7:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…