దసరా సినిమాల్లో టాక్ పరంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది ‘భగవంత్ కేసరి’నే. కానీ విడుదలకు ముందు ఈ సినిమాకు ఆశించినంత హైప్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెమ్మదిగా జరిగాయి. దీంతో పోలిస్తే అనువాద చిత్రం అయిన ‘లియో’నే బాక్సాఫీస్ దగ్గర డామినేట్ చేసింది. తొలి రోజు టాక్ పరంగా ‘భగవంత్ కేసరి’ పైచేయి సాధించినా సరే.. కలెక్షన్ల విషయంలో ‘లియో’ తగ్గలేదు.
తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ‘భగవంత్ కేసరి’ రెండో రోజు ఇంకా తక్కువ కలెక్షన్లతో సరిపెట్టుకోవడంతో ఈ సినిమా అంతిమంగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే రూ.60 కోట్లకు పైగా షేర్ సాధిస్తేనే ‘భగవంత్ కేసరి’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో హిట్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా ఈ సినిమా ‘హిట్’ అనిపించుకుంటుందా లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ క్రమ క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ వెళ్లిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. దసరా పండుగ సెలవులను బాగా వాడుకున్నది ఈ చిత్రమే. సోమవారం పండుగ రోజు, ఆ తర్వాత కూడా వసూళ్లు నిలకడగా వచ్చాయి. వీక్ డేస్‌లోనూ మంచి ఆక్యుపెన్సీలు రావడం సినిమాకు కలిసొచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.80 కోట్లకు పైగా గ్రాస్, రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
ఈ వారం ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే చిన్న సినిమా మినహాయిస్తే చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. కాబట్టి ఈ వీకెండ్ కూడా ‘భగవంత్ కేసరి’ డామినేషన్ కొనసాగడం ఖాయం. ఇంకో వారం పాటు అదే బాక్సాఫీస్ విన్నర్‌గా నిలవబోతోంది. కాబట్టి ఇంకో పది కోట్ల షేర్ సాధించడం, బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేమీ కాదు. బయ్యర్లకు ఓ మోస్తరుగా లాభాలు కూడా అందించబోతోందీ చిత్రం. కాబట్టి బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ దక్కినట్లే.
This post was last modified on October 26, 2023 6:41 pm
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత…
ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన…
అధినేతలకు ప్రజలు అధికారాన్ని ఇస్తుంటారు. ఒకసారి ఒకరికి ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వటం రివాజు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూగా పాలనాధికారాన్ని…
ఓ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ గా వెలుగొందిన రోహిత్ శర్మ, ఇప్పుడు తన బ్యాటింగ్ ఫామ్ కోల్పోయి తీవ్ర…
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, 104 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా, ప్రత్యేక…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా పక్షపాతం అన్నది కనిపించదు. చివరకు ఆ విషయం…