కెరీర్ చరమాంకంలోకి వచ్చిన హీరోయిన్లందరూ పెళ్లి వైపు అడుగులు వేసే వాళ్లే. ఐతే అమలా పాల్ మాత్రం కొంచెం భిన్నం. ఆమె తన కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. కానీ ఆ వివాహం ఎంతో కాలం నిలవలేదు. తనకు కేవలం పాతికేళ్ల వయసుండగా.. కెరీర్ మంచి ఊపు మీదుండగా ఆమె తమిళ దర్శకుడు విజయ్‌ను పెళ్లాడటం.. రెండేళ్లకే వీళ్లిద్దరూ విడిపోవడం తెలిసిందే.
ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు మరో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లలేదు అమలా. మధ్యలో ఒక సింగర్‌తో ఆమెకు పెళ్లయినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అదంతా ఉత్తుత్తిదే అని తర్వాత తేలింది. ఐతే ఎట్టకేలకు అమలా పాల్ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న జగత్ దేశాయ్‌తో ఆమె వివాహ బంధంలోకి వెళ్లనుంది. అతడి మ్యారేజ్ ప్రపోజల్‌కు తాజాగా అమలా ఆమోద ముద్ర వేసింది.
తాజాగా అమలా తన 32వ పుట్టిన రోజును జరుపుకుంది. ఆ సందర్భంగా జగత్‌తో కలిసి ఆమె డేట్‌కు వెళ్లింది. ఇద్దరూ డిన్నర్ చేసిన అనంతరం అమలాకు జగత్ ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పింది. ఈ వీడియోను జగతే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ బంధం అధికారికం అయింది. కొంత కాలంగా జగత్‌తో కలిసి అమలా తరచుగా మీడియా కళ్లలో పడుతోంది.
అప్పుడే వీళ్లిద్దరి మధ్య రిలేషన్‌షిప్ నడుస్తోందని అర్థమైంది. ఇప్పుడు అఫీషియల్‌గా తమ రిలేషన్ గురించి ఈ జంట మీడియాతో పాటు అందరికీ చెప్పేసింది. తమిళంలో ఒక బి గ్రేడ్ మూవీతో అమలా కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా విషయంలో అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా అమలా మాత్రం పాపులర్ అయింది. ఆ తర్వాత ‘మైనా’ సినిమా మెయిన్ స్ట్రీమ్ మూవీస్‌లో ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో సహా పలు చిత్రాల్లో నటించింది అమలా.
This post was last modified on October 26, 2023 4:43 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…