సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేసుకోవడం పెద్ద చిక్కుగా మారిపోయింది. మాస్ మహారాజా రవితేజ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఇవాళ కొత్త సినిమా మొదలైంది. ప్రత్యేకంగా నిన్నంతా దీనికి పని చేస్తున్న టీమ్ సభ్యుల ఫోటోలతో మైత్రి సంస్థ సోషల్ మీడియాలో స్పెషల్ ప్రమోషన్లు చేసింది. రైటర్లను సైతం ఫోటోలు తీయించి పబ్లిసిటీలో వాడుకోవడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో ఈవివి జమానాలో టైటిల్ కార్డులో ఇలా చేసేవారు కానీ తర్వాత ఎవరూ ఫాలో కాలేదు. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత ఈ కలయికలో వస్తున్న నాలుగో మూవీ ఇది.
అంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ మాత్రం ఇంకా ఎంపికవ్వలేదు. రష్మిక మందన్న కోసం గట్టిగానే ట్రై చేశారు కానీ సాధ్యం కాలేదని వినికిడి. ఇదే బ్యానర్ లో పుష్ప చేస్తున్న ఈమెకు కాల్ షీట్ల సమస్య ఉండటంతో ఆఖరి నిమిషం వరకు ట్రై చేసి చివరికి నో చెప్పిందని సమాచారం. ఉప్పెన భామ కృతి శెట్టిని కూడా అడిగారు కానీ ఇంకా సిగ్నల్ రాలేదని అంటున్నారు. మాస్ రాజా పక్కన జోడిగా సెట్ అవుతుందా లేదానే అనుమానాలు లేకపోలేదు. ప్రస్తుతానికి థర్డ్ ఆప్షన్ చూస్తున్నారు కానీ ఇంకో వారం పది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాకపోవచ్చని అంతర్గత వర్గాల సమాచారం.
వీరసింహారెడ్డి తర్వాత గోపిచంద్ మలినేని చేస్తున్న సినిమా ఇదే. స్క్రిప్ట్ మీద ఆరేడు నెలలు పని చేశారు. ఇది క్రాక్ తరహాలోనే నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోందట. విలన్ గా సెల్వ రాఘవన్, మరో ముఖ్యమైన పాత్రలో ఇందుజా రవిచంద్రన్ నటించబోతున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, తమన్ సంగీతం మరోసారి ఈ బృందానికి బలం కాబోతున్నాయి. రావణుసుర డిజాస్టర్ ఫలితం, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ తర్వాత ఈగల్ కోసం ఎదురు చూస్తున్న రవితేజకు తన పర్ఫెక్ట్ గా డీల్ చేస్తానని పేరున్న గోపిచంద్ తో మళ్ళీ జత కట్టడం పట్ల ఫుల్లు హ్యాపీగా ఉన్నాడు
This post was last modified on October 26, 2023 4:37 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…