ఎంత పెద్ద దర్శకుడికైనా ఎన్ని ఇండస్ట్రీ హిట్లు ఇచ్చినా కెరీర్లో ఒకటో రెండు ఫ్లాపులు డిజాస్టర్లు ఉండటం సహజం. కెవి రెడ్డి, రాజ్ కపూర్ లతో మొదలుపెట్టి బోయపాటి శీను దాకా ఇది అందరికీ అనుభవమే. కానీ అపజయాలకు అతీతంగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా మిగిలేవాళ్ళు మాత్రం కొందరే ఉంటారు. వాళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ఎస్ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ దాకా అంతకంతా ఈయన గ్రాఫ్ లోకల్ నుంచి ఇంటర్నేషనల్ ఆస్కార్ దాకా ఎదుగుతూ పోయిందే తప్ప ఇంచు కూడా తగ్గడం కానీ ఫ్లాప్ మొహం చూడటం కానీ ఏనాడూ జరగలేదు.
బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరానీని తీసుకుంటే సుదీర్ఘమైన ప్రస్థానంలో తీసింది అతి తక్కువ సినిమాలే అయినా చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్స్ ఇచ్చారు. అందుకే షారుఖ్ ఖాన్ డుంకీ మీద హీరో మార్కెట్ తో సమానంగా డైరెక్టర్ బ్రాండ్ మీద బిజినెస్ జరుగుతోంది. దీన్ని బట్టే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ సరసన అనిల్ రావిపూడి పేరుని ప్రస్తావించడం కొందరికి రుచించకపోవచ్చు కానీ విజయాలే కొలమానంగా భావించే ఇండస్ట్రీలో ఇతను తీసిన ఏడు సినిమాలు సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్స్ గా నిలవగా వాటిలో నాలుగు చిత్రాలు వంద కోట్ల గ్రాస్ ని దాటేయడం జక్కన్న తర్వాత అనిల్ కే సాధ్యమయ్యింది.
ఇక్కడ ముగ్గురు సమానమని చెప్పడం లేదు. విద్వత్తులో ఎవరి ప్రత్యేకత వారికి ఉంది. కానీ నిర్మాత నమ్మి కోట్ల డబ్బులు పెడుతున్నప్పుడు, ప్రేక్షకులు నమ్మి టికెట్లు కొంటున్నప్పుడు వాటికి సంపూర్ణ న్యాయం చేసేవాళ్లనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అంటాం. అనిల్ తీస్తున్నవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే. అందులో డౌట్ లేదు. కానీ అలంటి వాటిని సక్సెస్ ఫుల్ హ్యాండిల్ చేయలేక చేతులెత్తేస్తున్న పెద్ద దర్శకులను నెలకొకరి చొప్పున చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ట్రెండ్ లో అనిల్ రావిపూడిని ఎంటర్ టైనర్లు మాత్రమే చేశాడని తక్కువ చేసి చూడలేం. పటాస్ నుంచి భగవంత్ కేసరి దాకా ప్రయాణం అలాంటిది మరి.
This post was last modified on October 26, 2023 7:22 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…