రానా దగ్గుబాటి కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అని చెప్పొచ్చు. అంతకుముందు వరకు అతను హీరోగా ట్రై చేసి అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. ప్రేక్షకుల్లో యాక్సిప్టెన్స్ తెచ్చుకోలేక తన కెరీరో డోలాయమాన స్థితిలో ఉండేది. కానీ ‘బాహుబలి’లో భల్లాలదేవుడిగా విలన్ పాత్రను అద్భుతంగా పోషించడంతో తనకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అతడికి తిరుగులేని డిమాండ్ ఏర్పడింది.
బహు భాషల్లో రకరకాల పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు రానా. ఇటీవలే అతను సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ఒక కీలక పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రానా.. మెగాస్టార్ చిరంజీవికి విలన్‌గా నటించబోతున్నాడన్న వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా దసరా రోజు కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణుల వివరాలు బయటికి వచ్చాయి కానీ.. కాస్టింగ్ సంగతే ఇంకా తేలలేదు. హీరోయిన్లుగా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. విలన్ పాత్రకు రానా ఓకే అయినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐతే చిరుకు విలన్‌గా రానా అంటే ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్నదే డౌట్. ఎందుకంటే చిరుకు బేసిగ్గా రానా బాగా క్లోజ్. రామ్ చరణ్‌కు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ రానానే. అతణ్ని కూడా తన కొడుకులా చూస్తాడు చిరు. వ్యక్తిగతంగా ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్లు సినిమాలో హీరో-విలన్ పాత్రలు చేస్తే సెట్ అవుతుందా అన్న డౌట్ ఉంది. బేసిగ్గా రానా విలన్ పాత్రలో అదరగొట్టేయగలడు కానీ.. చిరుతో ఉన్న వ్యక్తిగత బంధం ఒక్కటే ఈ పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న సందేహం కలుగుతోంది.
This post was last modified on October 26, 2023 12:06 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…