అదేంటో తమన్ పాటలతోనే కాదు ఒక్కోసారి మాటలతోనూ ట్రోలింగ్ కు గురవుతాడు. భగవంత్ కేసరి ప్రమోషన్ల భాగంగా దర్శకుడు బాబీ బాలయ్య టీమ్ తో చేసిన ఇంటర్వ్యూలో భాగంగా తమన్ చెప్పిన కొన్ని విషయాలు రాంగ్ ట్రిగ్గర్ అయ్యాయి. జీవం లేని సన్నివేశాలు చనిపోయిన శవం లాంటివని, వాటిని మంచి మ్యూజిక్ ఇచ్చి లేపమంటే ఎవరి వల్లా కాదని అన్నాడు. అనిల్ రావిపూడి మంచి అవుట్ ఫుట్ తెచ్చాడు కాబట్టి తాను బెస్ట్ ఇవ్వగలిగానని, అఖండకు అలాగే జరిగిందని ఇంకో ఉదాహరణ ఇచ్చాడు. నిజానికి తమన్ తేడా వచ్చిన ఫలితాల గురించి ఏ సినిమా పేరు చెప్పలేదు.
సరిగ్గా ఇక్కడే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్లకు ముందు నుంచి సర్కారు వారి పాటకు తమన్ పనితనం మీద వీలు దొరికినప్పుడల్లా ట్రోల్ చేస్తూనే ఉంటారు. అల వైకుంఠపురముని మించి ఇస్తాడనుకుంటే యావరేజ్ ఆల్బమ్ తో నిరాశ పరిచాడని నిలదీస్తుంటారు. ముఖ్యంగా బీచ్ ఫైట్ కు చప్పగా బిజిఎం ఇవ్వడాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. గుంటూరు కారంకి తన పేరే ప్రకటించినప్పుడు సోషల్ మీడియా పెద్ద ఎత్తున నో అనే క్యాంపైన్ రన్ చేశారు. ఇప్పుడు తమన్ అన్నది తమనేనని భావించి కారాలు మిరియాలు నూరడం మొదలుపెట్టారు.
హిట్టో ఫ్లాపో ఏ సినిమాకైనా సంగీత దర్శకుడు ఒకే పనితనం ఇవ్వాలన్నది ఫ్యాన్స్ కామెంట్. ఎన్నో డిజాస్టర్లకు మణిశర్మ, రెహమాన్ లాంటి వాళ్ళు మేజిక్ చేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంతే తప్ప చచ్చిన శవంతో ఒక దర్శకుడి పనితనాన్ని అవమానించడం ఏమిటని అభిమనుల ప్రశ్న. ఇద్దరి వైపు లాజిక్ ఉంది కానీ తమన్ కాస్త అత్యుత్సాహపడి పోలికను తప్పుగా ఎంచుకున్నాడు కానీ లేకపోతే ఇంత బ్యాక్ ఫైర్ వచ్చేది కాదు. గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ లతో తమన్ చాలా బలంగా ఋజువు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంతకు రెండింతలు టార్గెట్ చేసుకుంటారు.
This post was last modified on October 25, 2023 6:03 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…