Movie News

ట్విట్టర్ సలహారావులపై హరీష్ పంచ్‌లు

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ పంచ్ పవర్ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో అయినా, సోషల్ మీడియాలో అయినా హరీష్ శంకర్ వేసే పంచులు భలే పేలుతుంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ప్రస్తుతం హరీష్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక టీవీ ఛానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. ఈ సినిమా పేరును చెప్పలేక ఇబ్బంది పడ్డాడు. హీరోకు సినిమా పేరు కూడా గుర్తులేదంటే ఈ సినిమా పట్ల ఆయనకున్న ఆసక్తి ఏంటో తెలుస్తుంది అంటూ దర్శకుడు హరీష్ శంకర్ మీద పడ్డారు నెటిజన్లు.

వాళ్లందరికీ అదిరిపోయేలా రివర్స్ పంచులు ఇచ్చాడు హరీష్. అదే సమయంలో తాను ఎంతగానో అభిమానించే రవితేజతో కలిసి ఆయన కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’కు సంబంధించి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు హరీష్. అక్కడ కూడా హరీష్ మార్కు పంచులు పేలాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు లెంగ్త్ ఎక్కువ అయిందని సోషల్ మీడియాలో బలంగా అభిప్రాయాలు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా నిడివిని దాదాపు 20 నిమిషాలు తగ్గించారు. సినిమా ల్యాగ్  అంటూ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్ల గురించి హరీష్ స్పందిస్తూ.. ‘‘చాలామందికి లెంగ్త్‌కు, ల్యాగ్‌కు తేడా తెలియదు. సినిమా నచ్చకపోతే ఒక్క నిమిషం కూడా ల్యాగ్ లాగా ఉంటుంది. కానీ నచ్చితే ఎంత పెద్ద సినిమా అయినా చూస్తారు. రోలింగ్ టైటిల్స్‌లో కూడా క్లాప్స్ పడతాయి.

ఈ మధ్య జనాలకు ఓటీటీల్లో కంటెంట్ చూసి చూసి ఓర్పు తగ్గిందో ఏమో తెలియదు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్. ఒక వ్యక్తి 50 ఏళ్లో.. వందేళ్లో బతికితే.. అంత జీవితాన్ని రెండున్నర మూడు గంటల నిడివితో తీయడం అంత తేలిక కాదు. ఎప్పుడూ రెండున్నర గంటల సినిమాలు ఇచ్చే రవన్న ఈసారి మూడు గంటల సినిమా ఎందుకు చేశాడు అని ప్రేక్షకులు ఆలోచించాలి. సినిమా రిలీజ్ తర్వాత లెంగ్త్ తగ్గించారు కదా అని.. ఈ పని ఇంతకుముందు చేయొచ్చు కదా అని కొందరు అంటారు. సోషల్ మీడియాలో అత్యంత తేలికైన పనేంటంటే సలహాలు ఇవ్వడం.

కొందరు మాత్రమే నిర్మాణాత్మకంగా విమర్శ చేస్తారు. కొందరు తమ ఫ్రస్టేషన్ అంతా ట్రోలింగ్ రూపంలో చూపిస్తారు. తమ ఫెయిల్యూర్లకు ఇక్కడ వచ్చి అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. వాళ్ల ఫ్రస్టేషన్ తీర్చుకోవడానికి మనం ఔట్‌లెట్‌గా మారినందుకు గర్వపడాలి. ఇంకొంతమంది ఉంటారు.. వాళ్లు పొగడరు, విమర్శించరు. కేవలం సలహాలు ఇస్తుంటారు. ఈ సలహాలు అనంతం. నేను కళ్యాణ్ గారి సినిమా తీస్తున్నా కదా.. అందులో ఆయన గడ్డం ఎంత సైజులో ఉంటే బాగుంటుందో ట్రిమ్మర్ పాయింట్ కూడా చెబుతున్నారు. సలహాలు ఇవ్వడం అంటే సులువు కదా. అందుకే ఇలా మాట్లాడతారు. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని హరీష్ శంకర్ అన్నాడు.

This post was last modified on October 25, 2023 2:59 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

39 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

2 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago