Movie News

శనివారంలో సూపర్ మ్యాన్ ట్విస్టు

ఇటీవలే ప్రారంభమైన నాని సరిపోదా శనివారం అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపింది. కాన్సెప్ట్ ఏంటో చెప్పకుండా వెరైటీగా కట్ చేయించిన టీజర్ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంది. తన సాధారణ శైలికి భిన్నంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈసారి కమర్షియల్ జానర్ తో పాటు యాక్షన్ ని టచ్ చేయబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. ఎస్జె సూర్యలాంటి ఖరీదైన నటుడిని విలన్ గా ఎంచుకోవడం, సాంకేతిక వర్గాన్ని క్వాలిటీగా సెట్ చేసుకోవడం ఇత్యాది అంశాలు హైప్ పెంచుతున్నాయి. అయితే టైటిల్ వెనుక గుట్టు ఏంటో అర్థం కాక అందరికీ పెద్ద సస్పెన్స్ లా మిగిలిపోయింది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో నానిని డిఫరెంట్ గా చూపించబోతున్నట్టు సమాచారం. వారంలో ఆరు రోజులు మాములు మనిషిగా ఉంటూ ఒక్క శనివారం మాత్రమే సూపర్ పవర్స్ వచ్చి అతీత శక్తిగా మారిపోయే పవర్ ఫుల్ పాత్రలో నానిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. తానుండే ఊరికి ప్రమాదం తలపడితే వాళ్ళను రక్షించడం కోసం పోరాడే వీరుడిగా ఎప్పుడూ చూడని కమర్షియల్ టచ్ ఇందులో జోడిస్తారని తెలిసింది. నాని మాస్ సినిమాలంటే వెంటనే నేను లోకల్, ఎంసిఏలు గుర్తొస్తాయి. కానీ వాటిలో లేని ఎలివేషన్ యాంగిల్స్ ఇందులో ఉంటాయని అంటున్నారు.

సరిపోదా శనివారం పేరు వెనుక ఉన్న అర్థం ఇదేనని వినికిడి. విలన్ ని ఛాలెంజ్ చేసే క్రమంలో నిన్ను ఎదిరించి మట్టికరిపించడానికి ఒక్క రోజు చాలని హీరో పాత్ర చేసే సవాల్ లో భాగంగా ఉంటుందని అంటున్నారు. ఇది నిజమో కాదో నిర్ధారణగా చెప్పలేం కానీ కాన్సెప్ట్ అయితే బాగుంది. గ్యాంగ్ లీడర్ తర్వాత ప్రియాంకా మోహన్ ఇందులో నానితో జత కడుతోంది. ఇదే డివివి బ్యానర్ లో నిర్మిస్తున్న ఓజిలో పవన్ కళ్యాణ్ కూ తనే జోడి అన్న సంగతి తెలిసిందే. ఇంకా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉందట. డేట్లు తీసుకోవడం ఆలస్యం ఒక్కొక్కటిగా అధికారిక  ప్రకటనలు వచ్చేస్తాయి. 

This post was last modified on October 25, 2023 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇంటరెస్టింగ్!.. టీడీపీ ఆఫీసులో అక్కినేని ఫామిలీ!

అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…

14 minutes ago

వర్మ విచారణకు వచ్చాడండోయ్..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…

32 minutes ago

అనిరుధ్ కోసం దర్శకుల పడిగాపులు

సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుధ్ రవిచందర్ తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉన్నా తెలుగు…

57 minutes ago

వైసీపీలోకి శైలజానాథ్.. ఆ లారీ డ్రైవర్ కు కష్టమే

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా…

1 hour ago

ఎన్డీయే చైర్మన్ పదవిని చంద్రబాబు కోరారా..?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…

2 hours ago

జగన్ కు సాయిరెడ్డి గట్టిగా ఇచ్చేశారుగా…!

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…

3 hours ago