దసరా సినిమాల్లో హైప్ వల్ల మొదటి రోజు లియో కొంత ఎక్కువ ఎడ్జ్ తీసుకున్నట్టు అనిపించినా ఓ రెండు షోలు పూర్తవ్వడం ఆలస్యం భగవంత్ కేసరి డామినేషన్ అంతకంతా పెరుగుతూ పోతోంది. నిన్నసెలవుల్లో చివరి రోజుని పూర్తిగా వాడుకుంటూ బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించడంతో రవితేజ,. విజయ్ లు తర్వాతి స్థానాలతో సర్దుకోవాల్సి వచ్చింది. ప్రధాన కేంద్రాలన్నీ బాలయ్యకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. మొదటి రోజు తర్వాత ఆ స్థాయిలో ఫిగర్లు నమోదయ్యింది నిన్ననే. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడంతో ఇంకో వీకెండ్ కేసరి కంట్రోల్ లోకి రాబోతోంది.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు భగవంత్ కేసరి ఆరు రోజులకు గాను వసూలు చేసిన షేర్ 51 కోట్ల 80 లక్షల దాకా ఉంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో 19 కోట్లు వచ్చేస్తే లాభాల్లోకి అడుగు పెట్టేస్తుంది. వీకెండ్ డ్రాప్ సహజమే అయినా అది మరీ తీవ్రంగా లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. మరో వైపు లియో ఆక్యుపెన్సీలు చాలా మటుకు తగ్గిపోయాయి. మెయిన్ సెంటర్స్ మినహాయించి బిసి కేంద్రాల్లో దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు లేదు. యూత్ మొదటి రెండు మూడు రోజుల్లోనే చూసేయడంతో థియేటర్లు అదే పనిగా నిండటం లేదు.
ఇక వీరసింహారెడ్డిని కేసరి దాటడం గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. సంక్రాంతికున్నంత ఫుల్ సహజంగా దసరాకు ఉండదు కాబట్టి ఆ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేయడం అంత సులభం కాదు. శ్రీలీల పాత్ర సెంటిమెంట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలు కుటుంబ ప్రేక్షకుల్లో బాగా దూసుకుపోవడం టీమ్ ప్రమోషన్ కు ఉపయోగపడుతోంది. ఈ నెల బుక్ మై షో యాప్ లో ఇప్పటిదాకా 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన ఒకే టాలీవుడ్ మూవీగా భగవంత్ కేసరి నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి అప్రతిహత జైత్రయాత్ర ఏడో సినిమాను నుంచి కొనసాగుతోంది. బాలయ్యకు హ్యాట్రిక్ దక్కింది.
This post was last modified on October 25, 2023 1:07 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…