టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అనగానే కొన్నేళ్ల కిందట దక్షిణాది ప్రేక్షకులందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఓకే అయిన దగ్గర్నుంచి ఒక సెన్సేషన్‌గానూ ఉంటూ వచ్చింది. విడుదలకు ముందు అంచనాలు మామూలుగా లేవు. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చి, అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మంచి ఫాంలో ఉన్న మురుగదాస్..మహేష్‌తో ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు. అక్కడి నుంచే మరుగదాస్ పతనం మొదలైంది. ఆ తర్వాత ఆయన తీసిన రెండు సినిమాలూ నిరాశపరిచాయి.
ఇప్పుడున్న ఫాంలో మురుగదాస్‌తో మహేషే కాదు.. ఏ టాలీవుడ్ టాప్ స్టార్ కూడా పని చేస్తాడని అనుకోలేం. అలాంటిది మళ్లీ మహేష్ బాబుతో సినిమా చేయడానికి మురుగదాస్ ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ విషయాన్ని ఓ తమిళ మీడియా సంస్థతో మురుగదాసే స్వయంగా వెల్లడించాడు. తాను మహేష్ కోసం మళ్లీ ఓ కథ రాస్తున్నానని.. అది పూర్తి కావస్తోందని.. త్వరలోనే మహేష్‌కు కథ చెబుతానని మురుగదాస్ తెలిపాడు. మరి మురుగదాస్‌తో మళ్లీ సినిమా చేయడం సంగతటుంచితే.. కథ వినడానికైనా మహేష్ సుముఖంగా ఉన్నాడా అన్నది ప్రశ్న. స్పైడర్ డిజాస్టర్ అయినా.. ఆ తర్వాత రెండు సినిమాలు తీసినా… మురుగదాస్ మాత్రం ఇప్పటికీ ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌గా స్పైడర్ పోస్టరే కొనసాగిస్తుండటాన్ని బట్టి మహేష్ మీద అభిమానం తగ్గలేదనే అనుకోవాలి.
This post was last modified on August 27, 2020 1:55 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…