మన హీరోలకు ఫాంటసీ జానర్ వైపు గట్టిగా మనసు లాగుతోంది. నిఖిల్ స్వయంభు కోసం ఇప్పటికే ఒళ్ళు హూనం చేసుకుంటూ చాలా కష్టపడుతున్నాడు. కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిజమైన ప్యాన్ ఇండియా సినిమాగా దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. కార్తికేయ 2 టైంలో వచ్చిన నేషనల్ ఇమేజ్ ని రెట్టింపు చేసే అవుట్ ఫుట్ ఖాయమని అడిగినవాళ్లందరికీ చెబుతున్నాడు. ఇప్పుడదే తరహాలో మెగాస్టార్ కు సైతం సంస్కృతం సౌండ్ అనిపించే టైటిల్ లాక్ చేయబోతున్నారని ఫ్రెష్ అప్ డేట్. మెగా 156కి విశ్వంభర టైటిల్ సీరియస్ పరిశీలనలో ఉన్నట్టు మెగా వర్గాల టాక్.
ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ చిరుతో సహా టీమ్ మొత్తం దీని మీద పాజిటివ్ గా ఉందట. విశ్వంభర పేరు సుప్రసిద్ధ రచయిత డాక్టర్ సి నారాయణరెడ్డి గారు రాసిన గొప్ప పుస్తకం. ఈ పదానికి లోతైన అర్థాలు చాలానే ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే విశ్వజనీతమైన శక్తిని పొంది పంచ భూతాలను శాసించే బలం ఉన్న వాడికి ఉపమానంగా దీన్ని వాడొచ్చు. దర్శకుడు వశిష్ట ఆ కోణంలో ఈ పేరు ప్రతిపాదన తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు కాబట్టి అప్పుడే దీని గురించి ప్రకటన ఇవ్వడం, ధ్రువీకరించడం లాంటివి చేయకపోవచ్చు.
ఎంఎం కీరవాణి పాట రికార్డింగ్ తో మొదలైన మెగా 156 వచ్చే సంవత్సరం దసరా విడుదలకు టార్గెట్ గా పెట్టుకుని ప్లాన్ చేసుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా సమయం డిమాండ్ చేసే అవకాశం ఉండటంతో 2025 జనవరికి సెట్ కావొచ్చని సమాచారం. ఒకవేళ విశ్వంభర టైటిల్ నే లాక్ చేసుకుంటే బింబిసార టైపు లో మెల్లగా జనాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కళ్యాణ్ కృష్ణది ఆపేసి మరీ దీన్ని ముందుకు తీసుకొచ్చిన చిరంజీవి ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల పైమాటేననే ప్రచారం ఆల్రెడీ అభిమానుల అంచనాలు అమాంతం పెంచేస్తో
This post was last modified on October 25, 2023 4:18 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…