అదుర్స్ సినిమాలో స్వచ్ఛ శాఖాహారి బ్రాహ్మణా కుటుంబానికి చెందిన అమ్మాయిగా నయనతార నటించడం చూశాం. ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ ని ప్రేమిస్తూనే ఇంకోపక్క ఆమె తల్లి బ్రహ్మానందాన్ని సాంతం దోచుకునే ఎపిసోడ్ మాములుగా పేలలేదు. ఇప్పటికీ దీని మీద మీమ్స్ వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంచితే మరోసారి ఇదే బ్యాక్ డ్రాప్ తో నయన్ టైటిల్ రోల్ పోషించిన సినిమా ఒకటి రాబోతోంది. పేరు అన్నపూర్ణి. లేడీ సూపర్ స్టార్ కాబట్టి బడ్జెట్ గట్రా భారీగా పెట్టారు. ఎంతగా అంటే స్టార్ నిర్మాతలే ఆలోచించే తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకునేంత. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. సంప్రదాయాలు, పద్ధతులు నిష్టగా పాటించే ఒక బ్రాహ్మణ అమ్మాయి తన రూములో ఇంజనీరింగ్ పుస్తకాలు చదువుతున్నట్టు కలరింగ్ ఇచ్చి లోపల మాత్రం చికెన్ ఫోటోలు పెట్టుకుని లొట్టలు వేసుకుంటూ ఉంటుంది. ఇది కనక ఇంట్లో వాళ్ళు చూస్తే కొంప మునగడం ఖాయం. అందుకే అంత గుట్టు. అయితే నాన్ వెజ్ మాట వింటేనే భగ్గుమనే కుటుంబంలో నయన్ ఇలా ఎందుకు చేసిందనేదే మెయిన్ పాయింట్ లా ఉంది. మరి వివాదాలు రావంటారా అని అడిగితే ఇప్పుడే చెప్పలేం. కొన్నేళ్ల క్రితం దేనికైనా రెడీ విషయంలో జరిగిన రచ్చ చూశాంగా.
దీంట్లో ప్రత్యేకంగా హీరో అంటూ లేరు. జర్నీతో మనకు దగ్గరైన జైని నయన్ జోడిగా పెట్టారు అంతే. టైటిల్ లో తిండి దేవత అనే క్యాప్షన్ పెట్టడం చూస్తుంటే ఏదో ట్విస్టు ఉన్నట్టు అనిపిస్తోంది. ఇది తమిళ, తెలుగు, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది. ఇంకా తేదీ నిర్ణయించలేదు. దర్శకుడి బ్యాక్ గ్రౌండే వెరైటీగా ఉంది. అతని పేరు నీలేష్ కృష్ణ. తీసింది ఒక్క మరాఠి సినిమా మాత్రమే. అయినా ఇంత పెద్ద ఆఫర్ అదీ తమిళంలో అంటే విచిత్రమే. తమన్ దీని గురించి ప్రత్యేకంగా ఫీలవుతున్నాడు. నిన్నే దీని గురించి ఒక స్పెషల్ ట్వీట్ పెట్టి మరీ ఊరించాడు. ఏదో విషయమైతే ఉంది.
This post was last modified on October 25, 2023 4:06 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…