సినిమా కుటుంబాల మధ్య పెళ్లి సంబంధాలు కుదరడం కొత్తేమీ కాదు. బాలీవుడ్లో ఈ ఒరవడి బాగా ఎక్కువ. టాలీవుడ్లోనూ అప్పుడప్పుడూ ఇలా సంబంధాలు సెట్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి కలయికే చూడబోతున్నట్లు సమాచారం. కీరవాణి కుటుంబం మురళీ మోహన్ కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి.. మురళీ మోహన్ మనవరాలిని పెళ్లాడబోతున్నాడట.
సింహాకు ఆ అమ్మాయితో ఇప్పటికే పరిచయం ఉందని.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఆమోద ముద్ర వేశాయని తెలుస్తోంది. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా ఉండొచ్చని అంటున్నారు. ఐతే ఇంకా కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవకు పెళ్లి కాలేదు. మరి ముందు తన వివాహం జరిపించి తర్వాత సింహా పెళ్లి సంగతి చూస్తారేమో తెలియదు. సింహా అయితే ఎంగేజ్ అయిపోయాడని తెలుస్తోంది.
కాలభైరవ, సింహా ఒకేసారి ‘మత్తువదలరా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. కాలభైరవ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకుడిగా మారితే.. సింహా హీరోగా అరంగేట్రం చేశాడు. కాలభైరవ కెరీర్ ఇప్పుడు బాగానే సాగుతోంది కానీ… తొలి సినిమా సక్సెస్ తర్వాత సింహా మాత్రం తడబడుతున్నాడు.
తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్.. ఇలా అతను చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. వీటిలో ‘ఉస్తాద్’ విషయం ఉన్న సినిమానే అయినా.. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. హీరోగా నిలదొక్కుకోవడానికి అతను కష్టపడుతున్నాడు. మురళీ మోహన్ మనవరాలు బిజినెస్ ఉమన్ అని తెలుస్తోంది. మురళీ మోహన్ కుటుంబం ఇప్పుడు సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంటోంది. వారికి భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు ఉన్నాయి.
This post was last modified on October 24, 2023 5:06 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…