సంక్రాంతి బరిలో నుంచి ఎవరో ఒకరు తప్పుకుంటే బెటరని బయ్యర్లు ఫీలవుతున్న టైంలో ఎవరికి వారు తగ్గేదేలే అంటూ ప్రకటనల పర్వం కొనసాగిస్తూ ఉన్నారు. తాజాగా హనుమాన్ బృందం జనవరి 12 రావడం ఖాయమని మరోసారి ధృవీకరిస్తూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. నిజానికి ఈ ప్యాన్ ఇండియా మూవీనే వాయిదా పడొచ్చని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ దీన్ని ఖండిస్తూ అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాడు. వందల కోట్లతో తీసినవే మాట మీద ఉండలేని పరిస్థితిలో హనుమాన్ మీద సందేహం రావడం సహజం. వీళ్ళు మాత్రం కుండబద్దలు కొట్టేశారు.
ఇక్కడ ట్విస్టు ఏంటంటే అదే 12న మహేష్ బాబు గుంటూరు కారం ఉందని తెలిసినా కూడా హనుమాన్ టీమ్ లెక్క చేయకపోవడం. ఒకే రోజు రాకూడదని రూల్ లేదు కానీ థియేటర్లు దొరకడం అంత సులభంగా ఉండదు. పైగా అయిదారు స్క్రీన్లు మాత్రమే అందుబాటులో ఉన్న బిసి సెంటర్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. అక్కడ ఎంత గ్రాఫిక్స్ అయినా అయినా సరే తేజ సజ్జ కన్నా మహేష్ కే ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోనీ టాక్ ఎక్స్ ట్రాడినరీ వస్తుందనే నమ్మకం ఉన్నా అసలంటూ టైంకి బొమ్మ జనాలకు చేరడం కీలకం. ఇదంతా ప్రాక్టికల్ గా చూడాల్సిన కోణం.
ఇంకోవైపు రవితేజ ఈగల్ 13న వస్తుంది. విజయ్ దేవరకొండ 10 లేదా 14న వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా రజనీకాంత్ ప్రత్యేక క్యామియో చేసిన లాల్ సలాంని లైకా సంస్థ తెలుగు డబ్బింగ్ కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది. శివ కార్తికేయన్ అయలన్ కు కాసిన్ని స్క్రీన్లు సర్దుబాటు చేయాలి. ఇంత పోటీ మధ్య హనుమాన్ లాంటి కంటెంట్ ఉన్న సినిమా కేవలం కాంపిటీషన్ వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చేసుకోకూడదు. తెరవెనుక ఇంత తతంగం ఉన్నప్పటికీ హనుమాన్ మాత్రం హనుమంతుడి రేంజ్ లో బలం చూపిస్తూ సై అంటోంది.
This post was last modified on October 24, 2023 2:02 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…