Movie News

డార్లింగ్ అభిమానులకు మళ్ళీ నిరాశే

ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తమ హీరో హైదరాబాద్ లో అందుబాటులో లేకపోయినా సరే కొత్త సినిమాల అప్డేట్స్ తో పండగ జోష్ ని రెట్టింపు చేసుకుందామనుకున్న అభిమానులకు ప్రొడక్షన్ హౌసులు మొండి చేయి చూపించాయి. సలార్ టీమ్ ఇప్పటిదాకా వదిలిన పాత స్టిల్స్ నే తీసుకుని కలిపి ఎడిట్ చేయించి విషెస్ చెప్పారు. కల్కి నిర్మిస్తున్న వైజయంతి సంస్థ ఒక అడుగు ముందుకేసి అదే సలార్ పోస్టర్ ని షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. వీళ్ళే ఇలా చేస్తే ఇంకా టైటిల్  కూడా ఖరారు కానీ మారుతీ దర్శకత్వం వహిస్తున్న సినిమా గురించి ఆశించడం కూడా తప్పే.

దీని వెనుక కారణాలు ఏమున్నా కనీసం కొత్త పోస్టర్లతో సంతృప్తి పరిచినా సరిపోయేది. చాలా ప్రాంతాల్లో పండగ రేపు కూడా చేసుకుంటున్నారు కాబట్టి బహుశా మంగళవారం సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందేమోనని కొందరు ఆశపడుతున్నారు. అయినా డార్లింగ్ బర్త్ డే కన్నా స్పెషల్ అకేషన్ వేరే ఏం కావాలి. ఆ రోజు ఇచ్చే కిక్ మరోసారి రాదుగా. ఉదయం ఛత్రపతి రీ రిలీజ్ స్పెషల్ షోలు చూసి బయటికి వచ్చిన ఫ్యాన్స్ ఆతృతగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒక్కటీ కొత్త అప్ డేట్ కనిపించపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. కనీసం ఓ వీడియో టీజర్ ని ఆశించడం తప్పు కాదుగా.

అయినా ప్రభాస్ విషయంలో ఇలా జరగడం మొదటిసారి కాదు. విడుదల వాయిదాలతో మొదలుపెట్టి అప్డేట్ల పోస్టు పోన్ల దాకా లెక్కలేనన్ని చూస్తున్నాం. ఫలానా రోజు బర్త్ డే అని తెలిసి కూడా దానికి అనుగుణంగా ఏదైనా ప్లాన్ చేయకపోవడం ముమ్మాటికీ సబబు కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎమోషన్స్ చాలా చిన్నవాటికి ఆనందపడతాయి, అంతే మోతాదులో బాధా పడతాయి. అది గుర్తిస్తే ఇలాంటివి రిపీట్ కావు. ఇండియాలోనే అతి పెద్ద కటవుట్ పెట్టుకున్న ఆందమైతే అభిమానులకు మిగిలింది కానీ ఏదో స్పెషల్ గా ఫీలయ్యే కంటెంట్ మాత్రం ఈ రోజు వచ్చే సూచనలు దాదాపుగా లేనట్టే. 

This post was last modified on October 23, 2023 4:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రతన్ టాటా మిస్టరీ ట్విస్ట్.. అతని పేరు మీద 500 కోట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…

25 minutes ago

“జ‌గ‌న్‌ది.. పొలిటిక‌ల్ రేప్‌.. నా మాట విను!”

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు సాకే శైల‌జానాథ్‌.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం…

27 minutes ago

తొలి సీజన్‌కు 40 లక్షలు.. రెండో సీజన్‌కు 20 కోట్లు

సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే…

58 minutes ago

ఇంటరెస్టింగ్!.. టీడీపీ ఆఫీసులో అక్కినేని ఫామిలీ!

అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…

2 hours ago

బెనిఫిట్ షోలు వద్దనుకోవడం మంచి పని

ఇవాళ విడుదలైన తండేల్ కు మంచి టాకే వినిపిస్తోంది. అదిరిపోయింది, రికార్డులు కొల్లగొడుతుందనే స్థాయిలో కాదు కానీ నిరాశ పరచలేదనే…

2 hours ago

వర్మ విచారణకు వచ్చాడండోయ్..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…

2 hours ago