ఒక మోహన్ బాబు సినిమాలో ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు అనే పాట ఉంటుంది. అంటే బిల్డప్ ఇవ్వడం తప్ప ఏమి చేయలేని వారిని ఉద్దేశించి లిరిక్స్ ఉంటాయి. ఇవి టైగర్ శ్రోఫ్ సినిమాకు అతికినట్టు సరిపోతున్నాయి. దసరా పండగ సందర్బంగా మొన్న అక్టోబర్ 20న భారీ ఎత్తున విడుదల చేసిన గణపథ్ పరిస్థితి మరీ అన్యాయంగా మారిపోయింది. రెండు రోజులకు కలిపి కనీసం 5 కోట్లు వసూలు చేయలేని దీన స్థితి చూసి బయ్యర్లు లబోదిబోమంటున్నారు. దేశం మొత్తం షోల ఆక్యుపెన్సీ 10 శాతం దాటడమే గగనంగా మారడంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగలనుంది.
హిందీలో పోటీ లేకుండా రిలీజైనా దాన్ని వాడుకోలేకపోవడం కన్నాపెద్ద ట్రాజెడీ ఏముంటుంది. మరోపక్క దీన్ని నమ్ముకుని ఎనిమిది వారాల ఓటిటి గ్యాప్ లేదని లియోని నిషేధించి బిల్డప్ ఇచ్చిన కొన్ని ఉత్తరాది మల్టీప్లెక్సులు ఘొల్లుమంటున్నాయి. జవాన్ తర్వాత నార్త్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ రాలేదు. దాన్నే మూడు వారాలు నమ్ముకుని మంచి ఫీడింగ్ తెచ్చుకున్నారు కానీ ఇప్పటికే జనం విపరీతంగా చూసేయడంతో కొన్ని కేంద్రాలు మినహాయించి అన్ని చోట్ల డ్రాప్ అయిపోయింది. గణపథ్ కనీసం యావరేజ్ ఉన్నా సరే ఏదోలే అని జనం థియేటర్లు వచ్చేవారు.
ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే దర్శకుడు వికాస్ బహ్ల్ దీన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కే దిక్కు లేదంటే సీక్వెల్ ని కొనే నాథుడు ఉండడు. మాస్ లో మంచి పట్టుందని పేరున్న టైగర్ శ్రోఫ్ కి ఇంత దారుణమైన ఓపెనింగ్ రావడం ట్రేడ్ ని ఆశ్చర్య పరుస్తోంది. మితిమీరిన హీరోయిజంతో ఇతగాడిని అతిగా చూపించే డైరెక్టర్లకు గణపథ్ ఫలితం ఒకరకంగా చెంపపెట్టు లాంటిది. అర్థం లేని కథా కథనాలు, తలా తోక లేని గ్రాఫిక్స్ తో ఆడియన్స్ సహనంతో ఆడుకున్నందుకు తగిన మూల్యం చెల్లించారు. ఈ ప్రభావం టైగర్ బాబు నెక్స్ట్ మూవీ చోటే మియా బడే మియా మీద పడేలా ఉంది.
This post was last modified on October 23, 2023 9:46 am
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…
కొత్త ఏడాది మొదలయ్యాక సినీ ప్రియులందరి దృష్టి సంక్రాంతి చిత్రాల మీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ…
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు,…
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ సినిమా వారం రోజులుగా బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న తీరు చూసి ట్రేడ్ పండిట్లు…