దర్శకుడు లోకేష్ కనగరాజ్ లియో విషయంలో అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా వసూళ్లు మాత్రం రచ్చ చేస్తున్నాయి. ఒక్కసారయినా చూడాల్సిందేనని మూవీ లవర్స్ గట్టిగా డిసైడైపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి. తమిళనాడులో సహజమే కానీ తెలుగులోనూ భారీ ఫిగర్స్ నమోదు కావడం విశేషం. విజయ్ పోషించిన పార్తిబన్, లియో పాత్రలకు సంబంధించి ఫ్యాన్స్ పూర్తిగా సంతృప్తిపడకపోవడంతో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ని లోకేష్ ఎలా డీల్ చేస్తాడనే టెన్షన్ తలైవా అభిమానుల్లో మొదలైంది. దాని కన్నా ముందు మూవీ లవర్స్ డిమాండ్ మరొకటి ఉంది.
కార్తీతో లోకేష్ కనగరాజ్ చేసిన ఖైదీ 2 ముందు కావాలని అడుగుతున్నారు. ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలతో ఒక సూపర్ క్రైమ్ థ్రిల్లర్ చూసిన అనుభూతి ఇప్పట్లో మర్చిపోవడం కష్టం. ముఖ్యంగా ఢిల్లీ క్యారెక్టర్ లో కార్తీ పరకాయ ప్రవేశం చేసిన తీరు, పోలీసులను కాపాడే ముందు డేక్షా బిర్యానిని ముందేసుకుని తిన్న ఎపిసోడ్ మాములుగా పేలలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రౌడీ గ్యాంగ్ చుట్టుముట్టిన పోలీస్ స్టేషన్ ఫైట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఢిల్లీ ఎందుకు జైలుకు వెళ్ళాడనే ప్రశ్నకు సమాధానం రెండో భాగంలో చూపిస్తానని లోకేష్ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు.
ఇప్పుడు దానికి సమాధానం దొరకాలి. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ ని కొనసాగించాలంటే ముందు ఢిల్లీని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాలి. విక్రమ్ కన్నా ముందు ఇతని ఫ్లాష్ బ్యాక్ రివీల్ కావాలి. అయితే రజనీకాంత్ 171 పూర్తి చేయడానికి టైం పడుతుంది. ఆ తర్వాతే ఖైదీ 2 ఉంటుంది. ఎంత లేదన్నా 2025 కు ముందు సాధ్యపడదు. అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు. లియో కూడా లోకేష్ అనుసంధాన ప్రపంచంలో భాగమని క్లారిటీ వచ్చేసింది కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా కార్తీ, సూర్య, విజయ్, కమల్ హాసన్ లను ఒకే ఫ్రేమ్ లో చూస్తే అంతకన్నా అరాచకం ఊహించుకోవడం కూడా కష్టమే.
This post was last modified on October 21, 2023 12:59 am
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…