Movie News

నందమూరి హీరో సినిమాలో విజయశాంతి

ఒకప్పటి వింటేజ్ బ్లాక్ బస్టర్లు ఎన్నింటిలోనో హీరోయిన్ గా అగ్ర హీరోలతో భాగం పంచుకున్న లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి చాలా కాలంగా తెరకు దూరంగా ఉన్నారు. ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే ఏళ్ళ తరబడి నో మేకప్ అంటూ వచ్చారు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ ముద్ర వేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు కోసం ఆవిడను ఒప్పించగలిగాడు. మహేష్ బాబు సినిమా కావడంతో పాటు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర  ఇవ్వడం వెంటనే చేసేయడం, అది బ్లాక్ బస్టర్ కావడం జరిగిపోయాయి.

ఆ సమయంలో భవిష్యత్తులో మళ్ళీ సినిమాలు చేసే అవకాశం లేదన్న విజయశాంతికి మరో కథ నచ్చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ఇవాళ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఓపెనింగ్ కి ప్రధాన తారాగణం విచ్చేశారు. హీరొయిన్ సయీ మంజ్రేకర్. విజయశాంతిని అంతగా మెప్పించిందంటే స్టోరీలో గట్టి మ్యాటరే ఉందన్న మాట. ఈ ప్రదీప్ గతంలో నారా రోహిత్ తో రాజా చెయ్యి వేస్తే తీశాడు. ఆశించిన ఫలితం అందుకోలేదు. తిరిగి ఇంత విరామం తర్వాత నందమూరి హీరోని ఒప్పించి ప్రాజెక్టు ఓకే చేసుకున్నాడు.

ఇలాగే విజయశాంతి కొనసాగితే బాగుటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బాబాయ్ బాలయ్యతో ముద్దుల మావయ్య, మువ్వగోపాలుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో తెరను పంచుకున్న సీనియర్ నటితో తాను నటించడం కళ్యాణ్ రామ్ కు ఒక మెమరీగా ఉండిపోతుంది. ప్రస్తుతం డెవిల్ విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ నందమూరి హీరో దాని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వరస ఫ్లాపులతో డౌన్ లో ఉన్న మార్కెట్ ని ఒక్కసారిగా బింబిసార తిరిగి ఇచ్చేసింది. దీంతో కాంబినేషన్ల ఎంపికలో కళ్యాణ్ రామ్ జాగ్రత్తగా ఉంటున్నాడు. వేరే దర్శకుడితో బింబిసార 2 ప్లానింగ్ ఉందని ఇన్ సైడ్ టాక్. 

This post was last modified on October 20, 2023 8:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…

5 hours ago

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

6 hours ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

7 hours ago

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

9 hours ago

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

10 hours ago