కన్నడలో కల్ట్ ఫిలింగా పేరు తెచ్చుకోవడమే కాదు మంచి వసూళ్లను కూడా రాబట్టిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ తెలుగులో ఎలాంటి మేజిక్ చేయలేకపోయింది. ఇది థియేటర్లలో వచ్చి వెళ్లిందనే సంగతి కూడా ఎవరికీ గుర్తు లేనంత వేగంగా మాయమైపోయింది. దీనికి తోడు డబ్బింగ్ వెర్షన్ వచ్చిన వారం రోజులకే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడంతో ఉన్న కాసిన్ని ఆశలు ఆవిరయ్యాయి. రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన ఈ లవ్ కం జైలు డ్రామాలో బోలెడంత ఎమోషన్ ని దట్టించారు దర్శకుడు హేమంత్ రావు. శాండల్ వుడ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి కానీ మనవాళ్లకు ఎక్కలేదు.
ఇప్పుడు కీలకమైన రెండో భాగం రిలీజ్ కు రెడీ అవుతోంది. వాస్తవానికి అక్టోబర్ 27 విడుదల ప్లాన్ చేసుకున్నారు. కానీ శివరాజ్ కుమార్ ఘోస్ట్ తో పాటు పక్క బాషల లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావుల నుంచి దసరా పోటీ తీవ్రంగా ఉండటంతో రిస్క్ అవుతుందని భావించి నవంబర్ 17కి షిఫ్ట్ చేశారు. ఆ టైంలో పెద్దగా పోటీ లేదు. నిజానికి సప్తసాగరాలు దారి సైడ్ బిలో అసలు స్టోరీ ఉంటుంది. హీరో శిక్ష పూర్తి చేసుకుని బయటికి వచ్చాక హీరోయిన్ దూరమైపోయి ఉంటుంది. కొత్త లైఫ్ పార్ట్ నర్ ని వెతుక్కుంటాడు. తన లైఫ్ ని నాశనం చేసిన వాళ్ళ పని పట్టేందుకు సంకల్పిస్తాడు.
అయితే ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యుంటే తెలుగు ప్రేక్షకులు కూడా సీక్వెల్ ని థియేటర్లలో చూసేందుకు ఆసక్తి ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడా ఛాన్స్ తక్కువే. ప్రమోషన్ పరంగా ఏదైనా మేజిక్ చేస్తే జనం అప్పుడు కదులుతారేమో కానీ ప్రస్తుతానికి బజ్ ఏర్పరచడం అంత సులభం కాదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హక్కులను కొన్న సంగతి తెలిసిందే. సైడ్ ఏ వర్కౌట్ కాకపోయినా దీని మీద నమ్మకం చూపిస్తున్నారు. ఈ మధ్య ఇతర బాషల ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు మన జనాలకు అంతగా ఎక్కడం లేదు. సిద్దార్థ్ గొప్పగా చెప్పుకున్న చిన్నా సైతం ఇక్కడ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.
This post was last modified on October 20, 2023 5:59 pm
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…