సంక్రాంతి తర్వాత దసరా సీజన్లో మాత్రమే ఒకేవారం రెండుకు మించి పెద్ద సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సీజన్లలో టాక్ బాగుంటే మూడు సినిమాలు కూడా బాగా ఆడటానికి స్కోప్ ఉంటుంది. అందుకే పోటీ గురించి పట్టించుకోకుండా సినిమాలను రంగంలోకి దించుతుంటారు. ఐతే అన్నింటికీ ఒకే రకమైన టాక్ వస్తే ఓకే కానీ.. ఒక సినిమాకు టాక్ బాగుండి, ఇంకోదానికి బాలేకుంటే వాటి బాక్సాఫీస్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది.
టాక్ బాగున్న సినిమా ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుని వసూళ్ల మోత మోగిస్తే.. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు దారుణమైన ఫలితాలందుకుంటాయి. ఈ దసరాకి షెడ్యూల్ అయిన మూడు సినిమాలూ విడుదలకు ముందు ప్రామిసింగ్‌గా కనిపించాయి. దీంతో మూడూ బాగా ఆడేస్తాయనుకున్నారు. కానీ వాటిలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నది ‘భగవంత్ కేసరి’ మాత్రమే. భగవంత్ కేసరి గొప్ప సినిమా అని చెప్పలేం కానీ.. పైసా వసూల్ ఎంటర్టైనర్ అనడంలో సందేహం లేదు.
ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు మంచి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘భగవంత్ కేసరి’ని డామినేట్ చేసిన తమిళ అనువాద చిత్రం ‘లియో’ పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా యావరేజ్ అనిపించుకున్నా వసూళ్ల మోత మోగిపోయేది. కానీ సినిమా చూసిన వాళ్లందరూ పెదవి విరుస్తున్నారు. నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. ముందస్తు బుకింగ్స్ వల్ల తొలి రోజు వసూళ్లు బాగున్నా.. రెండో రోజు బాగా డ్రాప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సినిమా పుంజుకోవడం కష్టమే. ఇక శుక్రవారం రిలీజైన రవితేజ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఇందులో కొన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా సినిమా డిజప్పాయింట్ చేసింది. ఇది సీరియస్ సిినిమా కావడం, వయొలెన్స్ ఎక్కువ కావడం కొన్ని వర్గాల ప్రేక్షకులను దూరం చేసేదే. అదే సమయంలో బాలయ్య సినిమా ఫ్యామిలీస్, లేడీస్ కూడా చూసేలా ఉండటం ప్లస్ పాయింట్. దీంతో ఈ సినిమా దసరా విన్నర్‌గా నిలవబోతోందనడంలో సందేహం లేదు.
This post was last modified on October 20, 2023 3:25 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…