పెద్దలు ఊరికే అనలేదు. ఏదైనా మితంగా ఉండాలి లేదంటే వెగటుగా మారిపోతుందని. లోకేష్ కనగరాజ్ కు ఇది తెలిసొచ్చే టైం వచ్చేసింది. మార్కెట్ హడావిడి, ప్రమోషన్లు, విజయ్ ఇమేజ్ వల్ల లియో తమిళ వసూళ్లు ఘనంగా ఉండొచ్చు కానీ ఇతర భాషల్లో మాత్రం నెగటివ్ రెస్పాన్స్ మూటగట్టుకుంది. భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ తీవ్రంగా నిరాశపడినట్టు అటు పబ్లిక్ టాక్, ఇటు ఆన్ లైన్ అభిప్రాయాల్లో స్పష్టంగా వ్యక్తమవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ పుణ్యమాని వీకెండ్ కాస్త బలంగా ఉన్నప్పటికీ ఒకవేళ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఊచకోత ఇంకో స్థాయిలో ఉండేదన్నది వాస్తవం.
కాస్త విశ్లేషించుకుని చూస్తే లోకేష్ అతి నమ్మకమే చేటు చేసినట్టు కనిపిస్తోంది. సినిమాటిక్ యునివర్స్ కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చేలా చేసి తద్వారా తానేదో మార్వెల్, డిసి రేంజ్ లో ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్టు చేసుకున్న మార్కెటింగ్ ఇప్పుడు అసలుకే మోసం తెచ్చేలా ఉంది. సాంకేతికంగా లోకేష్ చాలా ఉన్నతంగా సినిమాలు తీస్తున్న మాట నిజం. కానీ లియో కథ మరీ కిందస్థాయికి వెళ్ళిపోయి అవుట్ డేటెడ్ ట్రీట్మెంట్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. రిలీజ్ కు ముందు విక్రమ్, ఖైదీలు చూసి థియేటర్లకు రమ్మని చెప్పడం కూడా అతిగానే పరిగణించాలి.
ఇప్పుడు లోకేష్ చేతిలో రజనీకాంత్ 171 ఉంది. లియో ఫలితం ఎలా ఉన్నా దాని హైప్ కు వచ్చిన డ్యామేజ్ ఏమి లేదు కానీ ఉన్నఫళంగా తన స్క్రీన్ ప్లే మీద ఈ సెన్సషనల్ డైరెక్టర్ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఏదైతే తన బలమో అదే బలహీనతగా మారుతున్న వేళ వీలైనంత త్వరగా మేలుకోవాలి. ఖైదీ నాటి ఫిలిం మేకర్ ని బయటికి తీయాలి. విక్రమ్ తరహా గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. లియో లాంటి అరిగిపోయిన మాఫియా డ్రామాలు ఎంచుకోకుండా వైవిధ్యానికి పెద్ద పీఠ వేస్తూ స్టోరీ సెలక్షన్ చేసుకుంటే ఫ్యాన్స్ లో తగ్గిన నమ్మకం టన్నుల్లో వెనక్కు వస్తుంది.
This post was last modified on October 20, 2023 12:08 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…