స్టార్ యాంకర్ ఓంకార్ కు హారర్ సినిమాలు తీయడంలో ప్రత్యేక ఇమేజ్ ఉంది. దెయ్యలతో కామెడీ చేయించడంలో లారెన్స్ తర్వాత అంత గుర్తింపు వచ్చింది తనకే. అందుకే నాగార్జున, సమంతా లాంటి స్టార్లు సైతం రాజుగారి గది 2లో నటించేందుకు ముందుకొచ్చారు. అయితే దాని మూడో భాగం ఫెయిలవ్వడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఓంకార్ ఈసారి వెబ్ సిరీస్ తో వచ్చాడు. మాన్షన్ 24 పేరుతో ఆరు ఎపిసోడ్ల సిరీస్ మొన్నటి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ గట్రా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకులు ఓ లుక్ వేద్దామనుకున్నారు. ఇంతకీ మాన్షన్ భయపెట్టిందా.
పురావస్తు శాఖలో పని చేసే కాళిదాసు(సత్యరాజ్) అదృశ్యం కావడంతో అతని మీద దేశద్రోహం కేసు నమోదవుతుంది. ఆ దిగులుతో తల్లి మంచాన పడటంతో అసలేం జరిగిందో కనుక్కుందామని కూతురు అమృత(వరలక్ష్మి శరత్ కుమార్) తండ్రి చివరిసారి వెళ్లిన మాన్షన్ హౌస్ కు ఒంటరిగా వెళ్తుంది. అక్కడ వాచ్ మెన్(రావు రమేష్) ఆ అపార్ట్ మెంట్ లో ఉన్న ఆరు ఫ్లాట్లలో జరిగిన దారుణమైన కథలను అమృతకు రోజుకొకటి చొప్పున వివరిస్తాడు. అయినా సరే ఇంకేదో రహస్యముందని గుర్తించిన అమృత చివరికి కాళిదాస్ జాడ ఎలా కనుక్కుంది, నిజంగా అక్కడ దెయ్యాలు ఏం చేశాయనేది స్టోరీ.
వర్మ డర్నా మనా హై స్టైల్ లో ఆరు విభిన్న నేపథ్యం కలిగిన హారర్ కాన్సెప్ట్స్ తీసుకున్న ఓంకార్ దాన్ని భయపెట్టేలా, ఆసక్తికరంగా మలిచేలా తడబడటంతో సగానికి పైగా కథలు చప్పగా సాగాయి. ఈజీగా ఊహించేలా ట్విస్టులు ఉండటం కారణమైతే, మరీ సినిమాటిక్ స్టైల్ లో రెగ్యులర్ క్లైమాక్స్ ని ఎంచుకోవడం ఉన్న కాసింత ఇంప్రెషన్ ని తగ్గించేసింది. క్యాస్టింగ్ లో సీనియర్ ఆర్టిస్టులను తీసుకోవడం, ప్రొడక్షన్ వేల్యూస్ గ్రాండ్ గా ఉండటం కొంత మేర కాపాడాయి కానీ అసలైన కంటెంట్ అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో మాన్షన్ 24 థ్రిల్స్ ను సరైన మోతాదులో ఇవ్వలేకపోయింది.
This post was last modified on October 18, 2023 5:47 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…