ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఫ్రస్టేషన్లో ఉన్న హీరో ఫ్యాన్స్ ఎవరు అంటే.. రామ్ చరణ్ అభిమానులు అనే చెప్పాలి. వేరే హీరోలు విరామం లేకుండా షూటింగ్స్ చేస్తూ తమ కొత్త చిత్రాలను చకచకా పూర్తి చేస్తుంటే.. చరణ్ మాత్రం విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నాడు. ఇందుకు అతణ్ని తప్పుబట్టడానికి ఏమీ లేదు. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి కావడం ఆలస్యం.. లెజెండరీ డైరెక్టర్ శంకర్ సినిమాను అతను మొదలుపెట్టాడు.
కొంత కాలం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగింది. కానీ మధ్యలో ఆగిన ‘ఇండియన్-2’ను శంకర్ టేకప్ చేసిన దగ్గర్నుంచి చరణ్‌తో ఆయన చేస్తున్న ‘గేమ్ చేంజర్’కు బ్రేక్ పడిపోయింది. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లలేక.. వేరే సినిమాను మొదలుపెట్టలేక చరణ్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. నిర్మాత దిల్ రాజు సంగతైతే చెప్పాల్సిన పని లేదు. శంకర్ కారణంగా ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది.
కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో చరణ్, రాజు సంయమనం పాటిస్తున్నారు. ఈ మధ్య కూడా ‘గేమ్ చేంజర్’ కొత్త షెడ్యూల్ మొదలైనట్లే మొదలై ఆగిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ షూట్ గురించి ఏవో వార్తలు వస్తున్నాయి. కానీ అవెంత వరకు నిజమో తెలియదు. ఇలాంటి టైంలో చరణ్.. ‘ఇండియన్-2’లో ఒక క్యామియో చేస్తున్నట్లుగా ఒక అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి ఆ వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది.
ఐతే ఈ అప్‌డేట్ ఎంత వరకు నిజమో ఏమో కానీ.. చరణ్ అభిమానులైతే ఇది చూసి మండిపోతున్నారు. ‘గేమ్ చేంజర్’ సంగతి తేల్చమంటే.. ‘ఇండియన్-2’లో క్యామియో చేయిస్తున్నావా అంటూ శంకర్ మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ‘లియో’లో చరణ్ క్యామియో మీద క్లారిటీ లేక వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి తెగ ఎగ్జైట్ అయ్యాక అది ఫేక్ న్యూస్ అని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ‘ఇండియన్-2’ క్యామియో అంటే పుండు మీద కారం చల్లినట్లు అనిపిస్తోంది.
This post was last modified on October 17, 2023 9:14 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…