టాలీవుడ్ పరిశ్రమకు దశాబ్దాల కలగా మిగిలిపోయిన జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అల్లు అర్జున్ ఇవాళ సగర్వంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. తండ్రి అల్లు అరవింద్, భార్య స్నేహతో పాటు ఇతర అవార్డులు స్వీకరించడానికి వచ్చిన సాటి తెలుగు ప్రముఖుల కళ్ళు ఆనందంగా మెరుస్తూ ఉండగా స్టేజిపైకి వెళ్లి సవినయంగా బెస్ట్ యాక్టర్ గౌరవాన్ని తీసుకున్నాడు. గతంలో ఎందరో గొప్ప నటులు, హీరోలు పుష్పకన్నా గొప్ప చిత్రాల్లో నటించినా రకరకాల కారణాల వల్ల ఇది చిరకాల స్వప్నంగా మిగిలిపోయింది.
చివరికి 2021 సంవత్సరానికి పుష్ప ద్వారా సాకారం కావడం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. బన్నీతో పాటు ఇతర విభాగాలకు గాను నేషనల్ అవార్డు తీసుకున్న వాళ్లలో ప్రేమ్ రక్షిత్, దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి, కాలభైరవ, బుచ్చిబాబు సన తదితరులున్నారు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి హయాం దాకా ఎవరికీ సాధ్యం కాని ఘనత దక్కించుకున్న అల్లు అర్జున్ పై ఇప్పుడు బాధ్యత మరింత రెట్టింపయ్యింది. పుష్ప 2 ది రూల్ మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి అనుగుణంగానే దర్శకుడు సుకుమార్ మరింత జాగ్రత్తగా పుష్పరాజ్ కథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈవెంట్ కి ముందు అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక కమర్షియల్ సినిమాకు ఇంత పెద్ద గౌరవం అందుకోవడం గర్వకారణంగా ఉందని చెప్పాడు. ఇది నిజమే. ఎందుకంటే పుష్ప కళాత్మక విలువలున్న లేదా సమాజానికి సందేశమిచ్చే చిత్రం కాదు. సబ్జెక్టు పక్కనపెడితే అనితర సాధ్యం అనిపించే రీతిలో పుష్ప పాత్రలో బన్నీ పరకాయ ప్రవేశం చేసిన తీరు దేశవ్యాప్తంగా ఆడియన్స్ నే కాదు నేషనల్ అవార్డు కమిటీ సభ్యులను సైతం మెప్పించింది. చివరికి కల నిజమైంది. రాబోయే రోజుల్లో ప్రతి ఏడాది తెలుగు నుంచి అన్ని విభాగాల్లోనూ బలమైన పోటీ ఇవ్వబోయే సినిమాలు రాబోయేది స్పష్టం.
This post was last modified on October 17, 2023 9:00 pm
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…