హఠాత్తుగా మధ్యాన్నం నుంచి లియో తెలుగు వెర్షన్ వాయిదా పడుతుందనే వార్తలు గుప్పుమనడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ తిన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్వింగ్ లో ఉండి ఉదయం ఏడు గంటల షోలకు రెడీ అవుతున్న టైంలో ఈ పిడుగుపాటు ఊహించనిది. అసలు వివరాలు చూస్తే లియో టైటిల్ ఆల్రెడీ ఒక నిర్మాత రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. తన అనుమతి లేకుండా విజయ్ సినిమాకు వాడుకున్నారని కోర్టులో పిటీషన్ వేయడంతో అతనికి అనుగుణంగా అక్టోబర్ 20 దాకా రిలీజ్ ని వాయిదా వేస్తూ ఆర్డర్ ఇవ్వడంతో కలకలం రేగింది.
ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత నాగవంశీ స్వయంగా ప్రెస్ మీట్ ద్వారా దీని గురించిన క్లారిటీ ఇచ్చారు. ఇష్యూ వచ్చిన మాట వాస్తవమేనని, అతనెవరో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి ఒక మీడియా వ్యక్తి చెప్పాకే తనకూ తెలిసిందని, దీని బదులు ముందే మమ్మల్ని సంప్రదించి ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదని చెప్పారు. వీలైనంత త్వరగా వివాదాన్ని పరిష్కరించుకుని గురువారం మార్నింగ్ షోలకు సైతం ఎలాంటి ఇబ్బంది కలగకుండా యధాతథంగా రిలీజ్ చేయబోతున్నామని క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ హమ్మయ్యా అనుకుంటున్నారు.
బుకింగ్స్ ట్రెండ్ లో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కన్నా వేగంగా ఉన్న లియోకి ఇప్పుడే చిన్న బ్రేక్ పడ్డా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ ని మొదటి రోజు క్యాష్ చేసుకున్నంతగా తర్వాత కొనసాగించలేం. పైగా తమిళంలో వచ్చి తెలుగులో లేట్ అయితే అప్పటికే టాక్ గట్రా తెలుసుకున్న జనాల ఆసక్తి సహజంగానే తగ్గిపోతుంది. లోకేష్ కనగరాజ్ బ్రాండ్, అనిరుద్ రవిచందర్ సంగీతం, విజయ్ ఇమేజ్, లేని రామ్ చరణ్ క్యామియో గురించి ప్రచారం మొత్తం కలిసి లియో హైప్ ని అమాంతం మెట్రో స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నాయి.
This post was last modified on October 17, 2023 5:59 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…