విపరీతమైన జాప్యంతో ఎప్పుడు విడుదలవుతుందో అంతుచిక్కని అయోమయంలో అభిమానులను ఒత్తిడిలో పడేసిన గేమ్ చేంజర్ టీమ్ మనసు కరిగింది. దసరా పండగ సందర్భంగా మొదటి ఆడియో సింగల్ తో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టాలని దిల్ రాజు బృందం నిర్ణయించినట్టుగా లేటెస్ట్ అప్డేట్. ఆ మధ్య లీకై ఆన్ లైన్ నానా రచ్చ చేసిన తప్పుకోండి తప్పుకోండి పాటనే లిరికల్ వీడియో రూపంలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. చరణ్ ఎలాగూ హైదరాబాద్ లోనే ఉన్నాడు కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన తొలి వేడుక కావడంతో ఘనంగా చేయొచ్చు.
ప్రస్తుతం దిల్ రాజు విషాదంలో ఉన్నారు. ఇటీవలే తండ్రిలో కోల్పోయి ఆ బాధ నుంచి తేరుకునేందుకు ఇంకా బయటికి రాలేదు. విజయ దేవరకొండ 13 టైటిల్ లాంచ్ కార్యక్రమానికి వచ్చే అవకాశముంది. ఒకవేళ దానికి హాజరు కాకపోతే గేమ్ చేంజర్ ఈవెంట్ లో చూడొచ్చు. డేట్, వెన్యూ లాంటి నిర్ణయాలు ఇంకా జరగలేదు. దర్శకుడు శంకర్ సూచనలకు అనుగుణంగా ఈ ప్లానింగ్ మొత్తం ఉంటుంది. పాట లీకైన వెర్షన్ లో విన్నదాని కన్నా చాలా మెరుగ్గా ఒరిజినల్ సాంగ్ ఉంటుందని, తమన్ కంపోజింగ్ లో మంచి బీట్ సాంగ్ అవుతుందనే ఫీడ్ బ్యాక్ టీమ్ నుంచి వస్తోంది.
ఏదో ఒకటి కనీసం పాటతో మొదలుపెట్ట బోతున్నందుకు సంతోషించాలి. సినిమారిలీజ్ గురించి దసరాకే క్లారిటీ ఇవ్వకపోవచ్చు. ఇండియన్ 2 సంగతి తేలాలి. అది వేసవికి వస్తుందా లేక ఆగస్ట్ కు వెళ్తుందా అనేది ఇంకా చెప్పడం లేదు. గేమ్ చేంజర్ కూడా 2024 సంక్రాంతినే లక్ష్యంగా పెట్టుకుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా అంత ఆలస్యమవుతుందా లేదానేది దిల్ రాజు స్పష్టత ఇవ్వాలి. ఫ్లాష్ బ్యాక్ తాలూకు షూటింగ్ లో బిజీగా ఉన్న గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్ కాగా ఎస్జె సూర్య, జయరాం, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
This post was last modified on October 17, 2023 4:59 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…