స్టేజ్ మీద కొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తమను తాము నియంత్రించుకోలేక హీరోయిన్లతో వ్యవహరించే తీరు తీవ్ర వివాదాస్పదం అవుతుంటుంది. బాలీవుడ్లో ఇలాంటివి లైట్ తీసుకుంటారు కానీ.. దక్షిణాదిన మాత్రం ఇలా ప్రవర్తిస్తే మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయిపోతుంది. కొన్నేళ్ల కిందట ఓ సినిమా వేడుకలో సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు ముద్దివ్వడం తీవ్ర వివాదాస్పదం అయింది.
ఇటీవల ఇలాంటి ఉదంతమే మరొకటి చూశాం. ‘యజ్ఞం’ ఫేమ్ రవికుమార్ చౌదరి.. తన కొత్త చిత్రం ‘తిరగబడరా సామి’కి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో హద్దులు దాటి ప్రవర్తించాడు. హీరోయిన్ మన్నారా చోప్రాతో కలిసి ఫొటోలకు పోజులు ఇస్తూ.. ఆమెకు సడెన్‌గా ముద్దిచ్చేశాడు. ఆశ్చర్యపోయిన మన్నారా.. స్టేజ్ మీద తన కోపాన్ని చూపించకుండా నవ్వుతూ ఉండిపోయింది.
రవికుమార్ చౌదరి ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మన్నారా బాలీవుడ్ హీరోయిన్ కావడంతో జాతీయ స్థాయిలో ఈ వీడియో ట్రెండ్ అయింది. రవికుమార్ మీద ఒక రేంజిలో ట్రోలింగ్ జరిగింది. ఐతే ఈ వివాదంపై మన్నారా కానీ, రవికుమార్ కానీ ఆ సమయంలో ఏమీ స్పందించలేదు. కాగా హిందీ ‘బిగ్ బాస్’ షోకు పార్టిసిపెంట్‌గా వెళ్లిన మన్నారా.. ఈ వివాదం గురించి అక్కడ మాట్లాడింది.
రవికుమార్ ముద్దును వేరే రకంగా చూడొద్దని, అతను తనకు తండ్రి లాంటి వాడని ఆమె చెప్పడం విశేషం. ‘‘తిరగబడరా స్వామి ప్రమోషన్స్ ఊహించని మలుపు తిరుగుతాయని నేను అనుకోలేదు. రవికుమార్ గారికి నేను చిన్న పిల్లతో సమానం. ఆయన్ని నేను తండ్రితో సమానంగా భావిస్తా. చాలా రోజుల తర్వాత నన్ను చూడటంతో ఆనందంతో ఆయన అలా ముద్దు పెట్టారు. దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని మన్నారా పేర్కొంది.
This post was last modified on October 17, 2023 4:56 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…