వారం రోజుల క్రితం జగదేకేవీరుడు అతిలోకసుందరికి చెందిన హక్కులన్నీ మావేనంటూ ఎవరు ఏ రూపంలో కాపీ కొట్టినా, స్ఫూర్తి చెందినా, రీమేక్ చేసినా తదుపరి తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వైజయంతి మూవీస్ సంస్థ పబ్లిక్ గా హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని మీద ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో పెద్ద చర్చే జరిగింది. చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే మెగా 157ని ఉద్దేశించే ఈ ప్రకటన ఇచ్చారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరే రెండు మూడు రోజులు మాట్లాడుకుని అందరూ మర్చిపోయారు.
ఇవాళ హఠాత్తుగా మా ఇంద్రజ అంటూ అదే సినిమాలోని స్టిల్ ని తీసుకుని ఒక పోస్టర్ ని విడుదల చేసింది అశ్వినీదత్ బృందం. స్వచ్ఛత, అమాయకత్వం, శాంతికి సూచికగా అందరి హృదయాల్లో ఆమె స్థానం శాశ్వతం అంటూ ఓ సందేశం జోడించారు. బాగానే ఉంది కానీ అసలు ఇంద్రజ హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందో అంతు చిక్కడం లేదు. శ్రీదేవి పుట్టినరోజు ఆగస్టులో. చనిపోయింది ఫిబ్రవరిలో. జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ అయ్యింది మే నెలలో. మరి ప్రత్యేకంగా సందర్భం లేకపోయినా ఇలా మా ఇంద్రజ అంటూ ప్రత్యేకంగా హెడ్డింగ్ పెట్టడంలో ఆంతర్యం గుట్టుగా అనిపిస్తోంది.
ఏదైనా సినిమా లేదా తామే నిర్మించిన శ్రీమతి కుమారి వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమైతే అదేదో నేరుగా చెబితే సరిపోయేది. ఇలా ఇన్ డైరెక్ట్ గా పెడితే లేనిపోని డౌట్లు వస్తాయి. అసలు జగదేకేవీరుడు సీక్వెల్ ని రామ్ చరణ్ తో తీయాలని అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అశ్వినిదత్ మనసులోనూ అది ఉంది కానీ సరైన కథ దర్శకుడు కుదరాలి కదా. ఈలోగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ దేవరతో జరిగిపోయింది. మరి దగ్గరి భవిష్యత్తులో అయినా ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇంద్రజ గురించి చెప్పారు సరే మరి రాజు, మహాద్రష్టలను కూడా ఇలాగే హైలైట్ చేస్తారా.
This post was last modified on October 16, 2023 7:36 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…