తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడైన ఈ కుర్రాడు.. ఇప్పటికే పవన్ అభిమానుల్లో, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అతను హీరో కావడం లాంఛనమే అని పవన్ ఫ్యాన్స్ భావిస్తుండగా.. అకీరాకు నటన మీద ఆసక్తి లేదని.. తాను కానీ, పవన్ కానీ ఆ దిశగా ఫోర్స్ చేయట్లేదని ఇటీవల ఓ ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్లలో మీడియాను కలిసిన సందర్భంగా రేణు దేశాయ్ చెప్పడం పవన్ అభిమానులకు రుచించలేదు.
అకీరా అరంగేట్రం ఎప్పుడెప్పుడా అని చూస్తున్న వారికి.. ఈ మాటలు నిరాశ కలిగించాయి. ఐతే రేణు ఇప్పటికి ఈ మాట అన్నా.. భవిష్యత్తులో అకీరా హీరో కావడం ఖాయం అనే ఆశతోనే ఉన్నారు మెగా అభిమానులు. ఇలాంటి టైంలో ‘టైగర్..’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జరిగిన పరిణామం అందరి దృష్టినీ ఆకర్షించింది.
పవన్‌ను ఎంతగానో అభిమానించే లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ఈ వేడుకలో అకీరా అరంగేట్రం గురించి మాట్లాడారు. స్టేజ్ మీది నుంచి ఆయన రేణును ఉద్దేశించి మాట్లాడారు. ‘‘రేణు దేశాయ్ గారూ.. మీరు సినిమా ఫీల్డుకి దూరంగా ఉండొచ్చమ్మా.. కానీ మీరు మాకు చాలా దగ్గర. మీరు చాలా త్వరలో మీ అబ్బాయిని హీరో చెయ్యాలి. అందులో ఆ అబ్బాయికి మీరే తల్లిగా యాక్ట్ చెయ్యాలి’’ అని కరతాళ ధ్వనుల మధ్య విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
అకీరాను హీరోను చెయ్యాలి అన్న టైంలో రేణు.. ఎస్ఎస్ అంటూ చేతితో సింహనాదం చేయడం విశేషం. అకీరా తొలి సినిమాలో అతడికి తల్లిగా నటించాలి అన్నపుడు కూడా ఆమె తప్పకుండా అన్నట్లుగా సంజ్ఞ చేశారు. మొన్న ఇంటర్వ్యూలో అన్న మాటలకు, ఈ వేడుకలో రేణు స్పందించిన తీరుకు అసలు పొంతన లేదు. తాజా పరిణామం పవన్ అభిమానులకు మంచి ఉత్సాహాన్నే ఇచ్చాయి.
This post was last modified on October 16, 2023 7:37 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…