సంక్రాంతికి తప్పుకునే సినిమాల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో కొన్ని వారాలుగా ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. గుంటూరు కారం రావడంలో ఎలాంటి సందేహం లేదు. సైంధవ్ డేట్ ఆల్రెడీ లాక్ చేసుకుంది. రేపు టీజర్ తో ఒక్కసారిగా ప్రమోషన్లకు ఊపు తేబోతున్నారు. ఇంకో రెండు రోజుల తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ (ప్రకటించబోయే టైటిల్) సైతం తగ్గేదేలే అంటూ తేదీతో సహా నామకరణం అనౌన్స్ చేయబోతున్నారు. హనుమాన్ సౌండ్ తగ్గిపోవడంతో డౌట్ గానే ఉంది కానీ ఎప్పటికప్పుడు ప్రశాంత్ వర్మతో పాటు టీమ్ మళ్ళీ మళ్ళీ వెనకడుగు ఉండదని చెబుతోంది.
ఇక నాగార్జున నా సామి రంగా ఖరారుగా చెప్పే దాకా నిర్ధారణకు రాలేం. వీటి సంగతి కాసేపు పక్కనపెడితే రవితేజ ఈగల్ తప్పుకోవచ్చనే ప్రచారం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఊపందుకుంది. కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ సైతం అదే చెప్పుకుంటూ వచ్చాయి. అయితే ఇవాళ జరిగిన టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ ఈగల్ సంక్రాంతికి విడుదల చేయడం పక్కా అని మరోసారి ధృవీకరించారు. రెండు పండగలకు మాస్ మహారాజా నుంచి రెండు కానుకలు ఖాయమనే కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పోటీ రసవత్తరంగా మారిపోయింది.
ఈ లెక్కన ఊహించిన దానికంటే జనవరి బాక్సాఫీస్ వేడి చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఎవరివీ చిన్న బ్యానర్లు కాకపోవడంతో రాజీ పడే ప్రసక్తి కనిపించడం లేదు. ఎటొచ్చి నాగార్జున మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. ఒకప్పుడు సోగ్గాడే చిన్ని నాయనాని భారీ కాంపిటీషన్ లోనూ బ్లాక్ బస్టర్ సాధించిన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ ఇప్పటి పరిస్థితి వేరు. అందుకే నా సామీ రంగా ఏం చేస్తుందనే సస్పెన్స్ బయ్యర్లలోనూ తీవ్రంగా ఉంది. ఇంకా చాలా టైం ఉందనుకోవడానికి లేదు. కళ్ళు మూసుకుంటే నాలుగు నెలలు గిరగిర తిరిగిపోతాయి కాబట్టి త్వరగా పనులు పూర్తి చేయాల్సిందే.
This post was last modified on October 15, 2023 11:55 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…