Movie News

భగవంత్ బాలయ్య పంచులు సెటైర్లు

భగవంత్ కేసరి ప్రమోషన్లలో భాగంగా ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో బాలకృష్ణ, శ్రీలీల కలిసి సినిమాలోని ఎమోషనల్ సాంగ్ కి స్టేజి మీద స్టెప్పులు వేయడం బాగా ఆకట్టుకుంది. బాలయ్య కంటే ఒకింత ఆలస్యంగా వచ్చిన అమ్మాయిని ఏమి అనకుండా దగ్గరగా వచ్చినప్పుడు తల మీద చేయి పెట్టి ఆశీర్వదించడంతో మొదలుపెట్టి చిచ్చా అన్న పిలుపుని సార్ధకం చేసేలా నిజంగానే ఆమెను కంటికి రెప్పలా బయట కూడా ప్రవర్తిస్తున్న తీరు హత్తుకునేలా ఉంది. దీన్ని బట్టే ఇద్దరి మధ్య బంధం కేవలం తెరకు మాత్రమే పరిమితం కాదని అభిమానులకు అర్థమైపోయింది.

ఈ అనుబంధం ఇంత బలంగా కుదిరింది కాబట్టే స్క్రీన్ పై కూడా అదే మేజిక్ జరుగుతుందని అనిల్ రావిపూడి బలంగా నమ్ముతున్నారు. భగవంత్ కేసరి కథ మొత్తం శ్రీలీల పాత్రనే కేంద్రంగా చేసుకుని తిరుగుతుంది. ఆమెను మానసికంగా శారీరకంగా ఎలాంటి ఒత్తిళ్లనైనా తట్టుకునేలా తీర్చిదిద్దాలని తాపత్రయపడే క్యారెక్టరే బాలయ్య. పనిలో పనిగా ఆ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న గ్రౌండ్ ఫ్లోర్ కామెంట్స్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. ఇంట్లో మోక్షజ్ఞతో తాను చాలా స్నేహంగా ఉంటానని ఆ చనువుతోనే శ్రీలీల ప్రస్తావన వచ్చినపుడు అలా అన్నాడని మరోసారి నొక్కి చెప్పారు.

భగవంత్ కేసరి ట్యాగ్ లైన్ కు తగ్గట్టు ఐ డోంట్ కేర్ మనస్తత్వాన్ని నిజ జీవితంలోనూ పాటిస్తామని బాలయ్య చెప్పడం ఫ్యాన్స్ లో హుషారు నింపించింది. విగ్గు గురించి మొన్నెవరో కామెంట్ చేశారని, అయినా వాళ్లకేం బాధో అర్థం కావడం లేదని ఇటీవలే తన మీద వ్యంగ్య విమర్శలు చేసిన వాళ్లకు చురకలు విసిరారు. మొత్తానికి మంచి ఎనర్జీతో బాలయ్య టీమ్ స్టేజి మీద చేసిన సందడి బాగుంది. అక్టోబర్ 19కి ఆదివారం మినహాయించి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. రేపు ఎల్లుండి లోపు బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. 

This post was last modified on October 15, 2023 8:15 pm

Share

Recent Posts

ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ అవ‌స‌రం… ఇదిగో రీజ‌న్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు ఎంత అవ‌స‌ర‌మో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయ‌న‌ను…

24 minutes ago

లోకేష్… ట్విట్టర్ ని కూడా వదలట్లేదు

మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…

56 minutes ago

‘మ్యాడ్’ భామకు ప్యారడైజ్ ఛాన్స్ మిస్…

నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…

2 hours ago

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గ్రేటే

టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…

2 hours ago

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

8 hours ago

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

10 hours ago