Movie News

శంకర్ దాదా మంచి డేటు పట్టాడు కానీ

రీ రిలీజుల ట్రెండ్ బాగా నెమ్మదించిన నేపథ్యంలో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ శంకర్ దాదా ఎంబిబిఎస్ మళ్ళీ విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. నవంబర్ 4 గ్రాండ్ గా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ క్లాసిక్ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలిచిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ రీమేక్ గా 2004లో వచ్చిన ఈ మెగా మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో పరుచూరి బ్రదర్స్ రచన చేయగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఛార్ట్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా చిరు, శ్రీకాంత్ కామెడీ ఓ రేంజ్ లో పేలింది.

ఒకరకంగా నవంబర్ 4 మంచి డేట్ పట్టాడు శంకర్ దాదా. ఆ వారం చెప్పుకోదగ్గ భారీ రిలీజులు లేవు. ముందు రోజు కొన్ని ఉన్నాయి. తరుణ్ భాస్కర్ కీడా కోలా మీద యూత్ లో మంచి క్రేజ్ ఉంది. రిలీజ్ నాటికి ప్రమోషన్లతో దాన్ని పీక్స్ కి తీసుకెళ్లడం ఖాయం. స్టార్ క్యాస్టింగ్ లేదు కాబట్టి కంటెంట్ మీదే ఆధారపడాలి. ఓటిటి మూవీకి సీక్వెల్ గా వస్తున్న మా ఊరి పొలిమేర 2కి బన్నీ వాస్ అండగా నిలవడంతో థియేటర్ల పరంగా చెప్పుకోదగ్గ మద్దతు దక్కుతోంది. ఇవి కాకుండా విధి, నరకాసురలు ఉన్నాయి. మొదటి రోజే హౌస్ ఫుల్స్ వేయించే రేంజ్ వీటికి లేకపోవడం వల్ల చిరు నిర్మాతలు అలా ప్లాన్ చేసుకున్నారు.

బాగానే ఉంది కానీ జనంలో పాత సినిమాలను మళ్ళీ చూసే ఆసక్తి క్రమంగా తగ్గుతోందని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. కల్ట్ క్లాసిక్ గా చెప్పుకునే 7జి బృందావన్ కాలనీ హైదరాబాద్ మినహాయించి ఎక్కడ మేజిక్ చేయలేదు. మన్మథుడు, రఘువరన్ బిటెక్ హంగామా మొదటి రోజుకు మాత్రమే పరిమితమయ్యింది. ఇలాంటి సిచువేషన్ లో శంకర్ దాదా ఎంబిబిఎస్ కు ఏ మేరకు వస్తారో చెప్పడం కష్టమే. మెగా ఫ్యాన్స్ మాత్రం ఇలాంటివి పుట్టినరోజు లేదా ఏదైనా పండగ సందర్భంలో ప్లాన్ చేయకుండా ఇలా డ్రై టైంలో రిలీజ్ చేయడం ఏమిటని కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి శంకర్, ఏటిఎంలు ట్రెండ్ ని సృష్టిస్తారో లేదో.

This post was last modified on October 15, 2023 11:33 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

4 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

5 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

6 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

10 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

10 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

12 hours ago