యుక్త వయసులో ఒక కెరీర్ ఎంచుకుని అందులో నిలదొక్కుకోవడానికి, ఎదగడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరూ ఒక దశ దాటాక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. ఉద్యోగం చేస్తుండొచ్చు. వ్యాపారంలో ఉండొచ్చు.. ఇంకేదైనా పనిలో ఉండొచ్చు. ముదిమి వయసులో అన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా శేష జీవితాన్ని గడపాలనుకుంటారు.
పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. ఉన్న చోటి నుంచి దూరంగా వెళ్లిపోయి ప్రశాంత జీవనాన్ని సాగించాలనుకుంటారు. దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాంటి ప్రణాళికలోనే ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం వాళ్లు ఇప్పటికే పక్కాగా ప్రణాళిక రచించుకున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని ఈదులూరు అనే గ్రామాన్ని ఎంచుకున్నారట. రిటైర్మెంట్ తర్వాత తన శేష జీవితం అక్కడే కొనసాగుతుందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు.
ఈదులూరు గ్రామ పొలిమేరల్లో తనతో పాటు కీరవాణి, ఇతర కుటుంబ సభ్యులు పక్క పక్కనే పొలాలు కొన్నామని.. ప్రస్తుతం ప్రతి నెలా ఒక ఆదివారం అక్కడికి వెళ్లి వస్తుంటామని జక్కన్న చెప్పాడు. రిటైరయ్యాక పిల్లలందరూ స్థిరపడ్డాక పెద్దవాళ్లం అక్కడి వెళ్లి ఉండాలన్నది తమ ప్లాన్ అని రాజమౌళి వెల్లడించాడు. ఐతే వచ్చే పదేళ్ల వరకు రిటైర్మెంట్ ఆలోచనలేమీ లేవని ఆయన స్పష్టం చేశాడు.
ఇప్పుడైతే వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు కానీ.. ఒకప్పుడు రాజమౌళి, కీరవాణి తదితరులంతా కలిసి చెన్నైలో ఒకే ఇంట్లో ఉండేవాళ్లు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అన్నదమ్ములే. 15 మంది దాకా ఉన్న కుటుంబాన్ని వాళ్లిద్దరే పోషించేవాళ్లు. ముందు విజయేంద్ర.. ఆ తర్వాత కీరవాణి ఇండస్ట్రీలో నిలదొక్కుకుని కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొస్తే.. తర్వాత రాజమౌళి దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి తక్కువ సమయంలోనే ఒక స్థాయిని అందుకున్నాడు. ఆ తర్వాత ఆ కుటుంబానికి ఢోకా లేకపోయింది.
This post was last modified on April 25, 2020 3:59 pm
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు.…