కొన్ని సినిమాలకు ఓటీటీలో వచ్చే స్పందన ఆశ్చర్యపరుస్తుంటుంది. అక్కడ అవి అద్భుతమైన స్పందన తెచ్చుకుని బ్లాక్‌బస్టర్ రేంజికి వెళ్తుంటాయి. ‘రాజావారు రాణివారు’ అనే చిన్న సినిమా థియేటర్లకు వచ్చి వెళ్లిన సంగతే జనాలకు తెలియదు. కానీ ఆ చిత్రం కరోనా టైంలో ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుంది. ఇటీవలే ఆహా ఓటీటీలో రిలీజైన ‘ది గ్రేట్ ఇండియన్ సుసైడ్’ కూడా యావరేజ్ కంటెంట్‌తోనే భారీగా వ్యూస్ తెచ్చుకుంటోంది.
రెండేళ్ల ముందు హాట్ స్టార్ ఓటీటీలో రిలీజైన ‘మా ఊరి పొలిమేర’ అనే చిన్న సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. రిలీజైనప్పటి కంటే తర్వాత తర్వాత దీనికి ఫాలోయింగ్ పెరిగి మంచి పాపులారిటీ సంపాదించింది. చేతబడుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఓటీటీలో సూపర్ హిట్ రేంజికి వెళ్లిన ఈ సినిమాకు సీక్వెల్ తీసింది చిత్ర బృందం.
ఈ సీక్వెల్‌కు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లోనే కాక ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ కనిపిస్తోంది. నవంబరు 3న రిలీజవుతున్న ‘మా ఊరి పొలిమేర-2’ను ఫ్యాన్స్ రేటుకు బన్నీ వాసు, నందిపాటి వంశీ కలిసి కొని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ అయింది. ఐతే ఈ ట్రైలర్ చూస్తే సీక్వెల్ ఛాయలు పెద్దగా కనిపించలేదు. ఒక కొత్త కథతో దీన్ని డీల్ చేసినట్లు కనిపిస్తోంది.
‘మా ఊరి పొలిమేర’లో ఉన్న ప్రధాన పాత్రలతో పాటు కొన్ని కొత్త క్యారెక్టర్లు యాడ్ అయ్యాయి. కథ చూస్తే ‘కార్తికేయ’, ‘సుబ్రహ్మణ్యపురం’ లాంటి చిత్రాలను తలపిస్తోంది. మిస్టరీగా మారిన ఒక గుడి నేపథ్యంలో కథ నడిచేలా కనిపిస్తోంది. అందరూ భయంతో వణికిపోయే గుడిలోకి కొమిరి (సత్యం రాజేష్) వెళ్లి ఏం చేశాడన్నదే సస్పెన్స్. ‘మా ఊరి పొలిమేర’ సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమాకు కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి గ్రాండ్‌గానే తీసినట్లు కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు.
This post was last modified on October 14, 2023 5:17 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…