మాములుగా ఓటిటి మూవీకి కొనసాగింపంటే మళ్ళీ డిజిటల్ లోనే రావడం సహజం. కానీ సీక్వెల్ ని థియేటర్లకు సిద్ధం చేయడం అనూహ్యం. మా పూరి పొలిమేర 2 బృందం ఆ రిస్క్ చేస్తోంది. గతంలో డిస్నీ హాట్ స్టార్ కోసం తీసిన ఈ విలేజ్ హారర్ సినిమా ఆన్ లైన్లో భారీ స్పందన దక్కించుకుంది. కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టులతో డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మించారు. ఇవాళ కార్తికేయ, హరీష్ శంకర్ బన్నీ వాస్ తదితరులు ముఖ్య అతిథులుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. మొదటి భాగం కథ తెలిసిందే కాబట్టి దానికి కంటిన్యుయేషన్ ఇందులో చూపించారు.
ఆటో డ్రైవర్ కొమురి(సత్యం రాజేష్)కు ఊరి చివర ఉన్న గుళ్లో ఏదో రహస్యం ఉన్నట్టు అనుమానం వస్తుంది. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అసలు నిజం తెలుసుకోవడానికి వస్తాడో పోలీస్ ఆఫీసర్(రాకేందు మౌళి). అయితే స్నేహితుడైన బలిజ(గెటప్ శీను), తమ్ముడు జంగయ్య(బాలాదిత్య)లకు అనుమానం రాకుండా ఏదో రహస్యంగా చేస్తున్న కొమురికి అధికారులు గ్రామానికి వచ్చాక అసలు సమస్య వస్తుంది. ఎక్కడో ఉండే పద్మనాభస్వామి ఆలయానికి ఈ ఘటనలకు సంబంధం ఉందనే విషయం బయట పడుతుంది. అసలు మిస్టరీ ఏంటనేది తెరమీద చూడాలి.
కంటెంట్ తో పాటు ఈసారి విజువల్స్ లో డెప్త్ పెరిగింది. నిర్మాణ విలువలు కనిపిస్తున్నాయి. పూర్తిగా చేతబడుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మా ఊరి పొలిమేర 2లో అదనంగా దేవుళ్ళ నేపధ్యాన్ని జోడించారు. కొత్త ఆర్టిస్టులు తోడయ్యారు. గ్యానీ నేపధ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. టెక్నికల్ గా క్వాలిటీని పెంచిన ఈ సినిమా మీద దెయ్యాల ప్రియులకు ఆసక్తి కలిగేలా ట్రైలర్ కట్ చేశారు. పెద్ద హీరోలకు మాత్రమే ఉండే సీక్వెల్ ట్రెండ్ ని ఈసారి ఇలాంటి చిన్న చిత్రానికి అనుసరించడం కొత్తగా ఉంది. ఫలితం బాగా వస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రయత్నాలు జరుగుతాయి.
This post was last modified on October 14, 2023 12:29 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…