నందమూరి బాలకృష్ణ తన ప్రమేయం లేకుండా అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. టాలీవుడ్ సెలబ్రెటీలందరూ ఫాలో అవుతున్న ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ను బాలయ్య స్వీకరించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
రాజమౌళి నుంచి ఛాలెంజ్ తీసుకున్న తారక్.. తన పని ముగించి, బాబాయి బాలయ్యతో పాటు మరికొందరిని నామినేట్ చేశాడు. చిరు, వెంకీ తదితరులు అతడి సవాలును స్వీకరించారు. వీడియోలు పెట్టేశారు. కానీ బాలయ్య మాత్రం స్పందించట్లేదు.
బాలయ్య ఈ సవాలును అందుకుని ఇంటి పని చేస్తున్న వీడియోను పెడతాడేమో అని నందమూరి అభిమానులతో పాటు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ బాలయ్య వైపు నుంచి చప్పుడే లేదు. ఐతే బాలయ్య వీడియో పెడితే చూడాలి తప్ప ఆయన పెట్టాల్సిందే అని డిమాండ్ చేయడం, సైలెంటుగా ఉండటం పట్ల విమర్శలు చేయడం కరెక్టా అన్నది ప్రశ్న.
బాలయ్య రూటే సెపరేటు అన్నది చాలాసార్లు చూశాం. అసలు బాలయ్య తన సినిమాలు, తన తండ్రి సినిమాలు తప్ప వేరే వాళ్లవి అస్సలు చూడనని అని చాలాసార్లు చెప్పాడు. వేరే వాళ్ల సినిమాలే చూడనపుడు వాళ్లతో కలవడం, ఇలా ఛాలెంజులు విసిరితే తీసుకోవడం అన్నది ఎలా ఆశిస్తాం? అసలే తారక్‌తో ఆయనకు సరైన సంబంధాలు లేవు.
పైగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కూడా తారక్ ఈ మధ్య తన బావ నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదన్న సమాచారం కూడా బాలయ్యకు అంది ఉంటుంది. అలాంటపుడు అతను ఇచ్చిన సవాలును బాలయ్య ఎలా స్వీకరిస్తాడు.
అన్నింటికీ మించి బాలయ్యకు అసలు సోషల్ మీడియాలో అకౌంటే లేదు. ఇక తాను ఇంటి పని చేసిన వీడియోను ఎలా పోస్ట్ చేస్తాడు. అలా కాకుండా వీడియో తీసి ప్రెస్‌కు రిలీజ్ చేసి హంగామా చేయాల్సినంత విషయం కూడా కాదిది. అందుకే సైలెంటుగా ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో బాలయ్య నుంచి ఏమీ ఆశించకపోవడం బెటర్.
This post was last modified on April 25, 2020 3:57 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…