ఇటీవలే భోళా శంకర్ తో కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ అందుకున్న చిరంజీవి ప్రస్తుత ట్రెండ్ కి బోధపడుతున్నట్టు ఉంది. అయినా సరే కష్టపడే విషయంలో మారేది లేదంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ జర్నలిస్టు పాత్రికేయుల జీవితాల మీద రాసిన పుస్తకాన్ని మెగాస్టార్ తో లాంచ్ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చా గోష్ఠిలో హీరోయిజం గురించి ప్రస్తావన వచ్చింది. ఇంత లేటు వయసులో ఒళ్ళు హూనం చేసుకుని డాన్సులు ఫైట్లు కాకుండా ఊరికే అలా నడుచుకుంటూ వచ్చి వెళ్తూ, డైలాగులు చెబితే సంగీత దర్శకుడు రీ రికార్డింగ్ ఎలివేట్ చేస్తే దాంతో పనైపోతోందని సెటైర్లు వేశారు.
ఇది ప్రత్యేకంగా ఫలానా సినిమా గురించని చెప్పలేదు కానీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాత్రం జైలరే. దానికి అనిరుద్ రవిచందర్ చేసిన మేజిక్ చాలా లోపాలను కవర్ చేసిన సంగతి తెలిసిందే. ఇదని కాదు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కానీ చిరంజీవి వయసు దృష్ట్యా పోలిక చూసుకుంటే రజనీకాంత్ గురించే ప్రస్తావించారని అనుకోవచ్చు. అలా అని సూపర్ స్టార్ ని ఆయనేం తక్కువ చేయలేదు. ఇప్పుడు ఆడియన్స్ వాటిని ఆదరిస్తున్నారు కాబట్టి ఆ ధోరణి ఫాలో కావడం గమనిస్తున్నామని, అంతే తప్ప అదేమీ తప్పని అనలేదు అలా అని ఇదే ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పలేదు.
అయితే తాను అలా చేస్తే మాత్రం ప్రేక్షకులు ఒప్పుకోరని ఖచ్చితంగా నృత్యాలు పోరాటాలు ఉండాల్సిందేనని, కష్టం తప్పదని క్లారిటీ ఇచ్చారు. ఇది మంచి విషయమే కానీ అర్థవంతమైన స్క్రిప్ట్ లు, సరిగ్గా చూపించగలిగే దర్శకులు ఉన్నప్పుడు వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150 లాంటి హిట్లు పడతాయి. రీమేకులు, గుడ్డిగా డైరెక్టర్లను నమ్మడాలు చేస్తే ఆచార్యలు భోళాలు తగులుతాయి. అభిమానులు సైతం చిరంజీవి ట్రెండీగా చూడాలని కోరుకుంటున్నారు. మెగా 157లో ఫాంటసీ జానర్ ని టచ్ చేస్తున్నారు కాబట్టి ఈసారి రిస్క్ పరంగా కాస్త ఎక్కువ పనే ఉండొచ్చు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశముంది.
This post was last modified on October 12, 2023 10:46 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…
2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…