మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ కు సీక్వెల్ ఉంటుందన్న వార్త ఎవరు పుట్టించారో కానీ అభిమానుల్లో పెద్ద చర్చకే దారి తీస్తోంది. నిజానికి సీక్వెల్ ఉంటుందని నిర్మాత దిల్ రాజు కాని మిగిలిన టీమ్ సభ్యులు కానీ ఎక్కడా చెప్పలేదు. కనీసం చూచాయగా హింట్ కూడా ఇవ్వలేదు. దేవర లాగా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారేమోనని చెప్పడానికి షూటింగ్ మొదలై ఆరేడు నెలలు కాలేదు. రెండేళ్లు దాటింది. ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. ఈ రోజుకీ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతూనే ఉంది. అలాంటప్పుడు పార్ట్ 2 కష్టమే కదా.
నిజానికి ప్యాన్ ఇండియా సినిమాలకు సీక్వెల్స్ ఉంటేనే వర్కౌట్ అవుతాయనే నమ్మకం నిర్మాతల్లో బలపడుతోంది. కానీ జవాన్, పఠాన్ లాంటివి కేవలం సింగల్ పార్ట్స్ తోనే రికార్డులు సృష్టించిన సంగతి మర్చిపోకూడదు. ఒకవేళ సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్ లాగా మొదటిది బ్లాక్ బస్టర్ అయితే ఆ తర్వాత కొనసాగింపులు ప్లాన్ చేసుకోవచ్చు తప్ప ముందే అనేసుకుని రేపు ఫలితం ఏదైనా తేడా వస్తే బాధ పడకూడదు. స్కంద విషయంలో జరుగుతోంది అదే. చాలా ధీమాగా చివర్లో శుభం కార్డుకి 2 వేసిన దర్శకుడు బోయపాటి శీను మళ్ళీ రామ్ ని ఒప్పించడం దాదాపు జరగని పనే.
ఈ కోణంలో చూసుకుంటే గేమ్ ఛేంజర్ సింగల్ గా వస్తేనే బెటరనే అభిప్రాయం ఫ్యాన్స్ లో నెలకొంది. ఒకవేళ కాసేపు రెండో భాగం ఉంటుందనే అనుకున్నా శంకర్ మళ్ళీ రామ్ చరణ్ విలువైన కాలాన్ని డిమాండ్ చేస్తారు. అసలే అవతల బుచ్చిబాబు వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు షూటింగ్ కు వెళ్లిపోదామాని. కేవలం గేమ్ ఛేంజర్ కోసం ఆది ఆలస్యమవుతోంది తప్పించి ఆఫీస్ సెటప్ తో మొదలుపెట్టి స్క్రిప్ట్ దాకా సర్వం సిద్ధంగా ఉంచుకున్నాడు. రెహమాన్ రెండు మూడు ట్యూన్లు కూడా ఇచ్చాడు. ఇప్పటికే బోలెడు పుకార్ల పర్వంలో నలిగిపోయిన గేమ్ గేమ్ ఛేంజర్ కనీసం దీనికైనా స్పందిస్తుందో లేదో
This post was last modified on October 12, 2023 5:09 pm
మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.…
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు…
బాలీవుడ్ లో పట్టువదలని విక్రమార్కుడు పేరు ఎవరికైనా ఉందంటే ముందు అక్షయ్ కుమార్ గురించే చెప్పుకోవాలి. ఫలితాలను పట్టించుకోకుండా విమర్శలను…
ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ లో జరుగుతున్నవరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం నారా చంద్రబాబునాయుడు గడచిన నాలుగు…
వెంకటేష్ కెరీర్ లో మొదటి వెబ్ సిరీస్ గా వచ్చిన రానా నాయుడుకు వ్యూస్ మిలియన్లలో వచ్చాయి కానీ కంటెంట్…
అసలే గంజాయిపై ఏపీలోని కూటమి సర్కారు యుద్ధమే ప్రకటించింది. ఫలితంగా ఎక్కడికక్కడ పోలీసులు వాహనాల తనిఖీలు కొనసాగిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన…