సినిమాలు మేకింగ్ దశలో ఉండగా.. రిలీజ్ టైంలో ఘనంగా సీక్వెల్స్ ప్రకటించడం.. తర్వాతేమో వాటి ఊసే ఎత్తకపోవడం.. ఇదీ వరస. ఈ కోవలో చెప్పుకోవడానికి పదుల సంఖ్యలో సినిమాలున్నాయి. గత ఏడాది వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ లాంటి దారుణమైన డిజాస్టర్ మూవీకి కూడా సీక్వెల్ హింట్ ఇవ్వడం గమనార్హం. ఇలాంటి సినిమాలు చూసినపుడు.. ఫస్ట్ పార్ట్ చూడటమే నరకం అంటే, ఇంకా దీనికి సీక్వెల్ కూడానా అన్న అసహనం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతుంటుంది.
ఇక రెండు వారాల ముందు వచ్చిన సినిమాలకు కూడా ఘనంగా సీక్వెల్స్ ప్రకటించారు. రామ్-బోయపాటిల ‘స్కంద’తో పాటు శ్రీకాంత్ అడ్డాల మూవీ ‘పెదకాపు’కు కూడా సీక్వెల్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ తర్వాత కూడా వీటికి కట్టుబడ్డట్లే కనిపించాయి చిత్ర బృందం. ‘పెదకాపు’నైతే మూడు పార్ట్‌లుగా తీయాలని శ్రీకాంత్ అనుకున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి ఆశించిన ఫలితాలు రాలేదు. ‘స్కంద’ వీకెండ్ వరకు కొంచెం సందడి చేసి ఆ తర్వాత చల్లబడిపోయింది.
దాదాపుగా రూ.20 కోట్ల నష్టం వాటిల్లింది బయ్యర్లకు. ఇలాంటి మిడ్ రేంజ్ మూవీకి అంత నష్టం అంటే మామూలు విషయం కాదు. బయ్యర్ల పెట్టుబడిలో సగానికి సగం నష్టం వాటిల్లింది. బోయపాటి రిలీజైన వారం తర్వాత కూడా సీక్వెల్ సీక్వెల్ అంటూ ఉన్నాడు కానీ.. బయ్యర్లకు సెటిల్మెంట్ చేయాల్సిన స్థితిలో ఉన్న నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అసలు ఇంకో సినిమా తీయడమే కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు.
ఇక సీక్వెల్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు. బోయపాటి వేరే నిర్మాతను వెతుక్కుంటే ఓకే కానీ.. ఆయనైతే సీక్వెల్ ప్రొడ్యూస్ చేసే స్థితిలో లేడు. దాదాపుగా ఈ సీక్వెల్ క్యాన్సిల్ అయినట్లే అంటున్నారు. ఇక ‘పెదకాపు’ నిర్మాత అయితే పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాక లబోదిబోమంటున్నాడు. ఇక సీక్వెల్ అంటే ఏం చేస్తాడు. శ్రీకాంత్‌కు ఇప్పుడు ఇంకో సినిమా దక్కడమే కష్టంగా ఉంది. కాబట్టి ‘పెదకాపు’ పార్ట్-2 కూడా క్యాన్సిల్ అయినట్లే.
This post was last modified on October 11, 2023 9:48 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…