రెండు రోజుల నుంచి సోషల్ మీడియా లియో సినిమాకు సంబంధించిన ఒక రూమర్‌తో హోరెత్తిపోతోంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్యామియో రోల్ చేస్తున్నాడంటూ ఊదరగొట్టేస్తున్నారు సోషల్ మీడియా జనం. మీడియాలో కూడా దీని గురించి జోరుగా వార్తలు వస్తున్నాయి. చరణ్ ఈ సినిమాలో ఉండేందుకు స్కోపే కనిపించడం లేదు.
లోకేష్ కనకరాజ్ తాను ఇప్పటికే తీసిన సినిమాలు, తీయబోయే చిత్రాలకు కనెక్షన్ పెడుతూ లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్‌తో చేసే హంగామా గురించి తెలిసిందే. కాబట్టి ఈ చిత్రంలో ఎవరైనా క్యామియో చేశారంటే ఎల్‌సీయూతో టచ్ ఉన్నవాళ్లే అయ్యుండాలి. ఆ కోణంలో చూస్తే ప్రభాస్‌తో తాను సినిమా చేసే అవకాశాలున్నట్లు లోకేష్ చెప్పాడు కాబట్టి అయితే ప్రభాసే క్యామియో చేయాలి.
లేదంటే ఆల్రెడీ ఎల్‌సీయూలో భాగమైన కమల్ హాసన్, సూర్య, కార్తి లాంటి వాళ్లు ఎవరైనా కనిపించాలి. అంతే తప్ప ఈ సినిమాలో రామ్ చరణ్ ఉండేందుకు స్కోప్ లేదు. కానీ మెగా పవర్ స్టార్ ఒకటిన్నర నిమిషం క్యామియోలో సందడి చేయబోతున్నారంటూ మెగా అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఈ రూమర్ గురించి జరుగుతున్న చర్చలతో వాళ్లు ఏదేదో ఊహించుకుంటూ లియో మీద అంచనాలు పెంచుకుంటున్నారు.
ఎక్కడో ఫారిన్లో లియో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన చోట కాస్ట్ లిస్ట్‌లో చరణ్ పేరు ఉందని మెగా ఫ్యాన్స్ అతడి క్యామియో విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ టీం ఇచ్చిన సమాచారం మేరకే అక్కడ చరణ్ పేరు ఉందనుకోవడానికి వీల్లేదు. రూమర్లను నమ్మే అక్కడ ఆ పేరు జోడించారేమో. టీం నుంచి ఎవ్వరూ ఏ హింట్ ఇవ్వకుండా చరణ్ క్యామియో మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటే కష్టం. లియోకు తెలుగులో ఇటీవల హైప్ తగ్గిందన్న ఉద్దేశంతో కావాలనే చరణ్ క్యామియో గురించి పుకార్లు పుట్టించి ప్రచారం చేస్తున్నారనే సందేహాలు కూడా వ్యక్తమవుతుండటం గమనార్హం.
This post was last modified on October 11, 2023 10:54 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…