కీర్తి సురేష్‍తో సినిమా చేస్తే ఖచ్చితంగా ప్లస్సే అని ఈ లాక్‍డౌన్‍లో నిర్మాతలకు క్లారిటీ వచ్చేసింది. దక్షిణాది అంతటా కీర్తి పాపులర్ అవడం వల్ల ఆమె నటించిన చిత్రాల హక్కులను ఓటీటీ కంపెనీలు పెద్దగా ఆంక్షలు లేకుండా, ఎక్కువగా బేరాలు ఆడకుండా కొనేస్తున్నాయి.
సినిమా బాగున్నా, లేకపోయినా కానీ కీర్తి హీరోయిన్ అంటే వ్యూస్ అయితే గ్యారెంటీ. అందుకే ఆమె ప్రధాన పాత్రలో నటించిన మూడు సినిమాల హక్కులను ఓటిటిలు కొన్నాయి. దీంతో కీర్తి సురేష్‍తో లేడీ ఓరియంటెడ్ కథలు తెరకెక్కించాలని నిర్మాతలు పోటీ పడుతున్నారు. కానీ ఆమె ఇప్పుడు అలాంటి చిత్రాలకు బ్రేక్ ఇచ్చింది.
మహానటి తర్వాత భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడం తగ్గించేసిన కీర్తి ‘సర్కారు వారి పాట’ నుంచి ఇక డిమాండ్‍కి తగ్గట్టు పెద్ద సినిమాలకు డేట్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. వరుసగా అన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం కూడా హీరోయిన్స్ ఇమేజ్‍కి మంచిది కాదు.
సాధారణంగా హీరోయిన్లుగా ఒక పదేళ్ల పాటు భారీ చిత్రాలు చేసిన తర్వాత ఇలాంటి సినిమాలు చేయడానికి హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తారు. మొదట్నుంచీ ఇలాంటి మూసలో పడిపోతే తర్వాత వాళ్లతో నటించడానికి అగ్ర హీరోలు ఇష్టపడరు.
This post was last modified on August 26, 2020 2:50 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…